కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

రాజ్యమందిరంలో జరిగే కూటాలకు ఎందుకు వెళ్లాలి?

రాజ్యమందిరంలో జరిగే కూటాలకు ఎందుకు వెళ్లాలి?

 యెహోవాసాక్షులు, ఆరాధనా స్థలాలుగా పిలవబడే తమ రాజ్యమందిరాల్లో వారానికి రెండుసార్లు కూటాలు జరుపుకుంటారు. ఇంతకీ అక్కడేమి జరుగుతుంది? ఆ కూటాలకు హాజరవ్వడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?

 రాజ్యమందిరంలో ఏం జరుగుతుంది?

 రాజ్యమందిరంలో ముఖ్యంగా బైబిల్లోని విషయాల్ని మన జీవితాల్లో ఎలా పాటించాలో నేర్పిస్తారు. ఆ కూటాల ద్వారా మనం:

  •   దేవుని గురించిన సత్యాన్ని నేర్చుకుంటాం.

  •   నేడు జరుగుతున్న సంఘటనల వెనకున్న కారణాల్ని అర్థం చేసుకుంటాం.

  •   ఒక మంచి వ్యక్తిగా ఎలా తయారవ్వవచ్చో నేర్చుకుంటాం.

  •    మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించవచ్చో తెలుసుకుంటాం.

 మీకు తెలుసా? యెహోవాసాక్షులు, కూటాలు జరుపుకునే స్థలాల్ని రాజ్యమందిరాలు అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా దేవుని రాజ్యం గురించి చర్చిస్తారు.​—మత్తయి 6:9, 10; 24:14; లూకా 4:43.

 మీరెందుకు హాజరవ్వాలి?

 అక్కడ చెప్పే సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. యెహోవాసాక్షుల కూటాల్లో చర్చించే బైబిలు సూత్రాలు ‘జ్ఞానము సంపాదించుకోవడానికి’ సహాయం చేస్తాయి. (సామెతలు 4:5) అంటే ఆ సూత్రాల సహాయంతో మీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా జీవితంలో వచ్చే ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలకు కూడా జవాబులు తెలుసుకోగలుగుతారు:

 వారాంతాల్లో జరిగే కూటాల్లో ప్రసంగాలు ఇస్తారు. వాటి అంశాల్లో కొన్నిటిని చూడండి:

  •   బైబిలు చేత ఎందుకు నిర్దేశించబడాలి?

  •   విపత్కర కాలాల్లో మీరు సహాయాన్ని ఎక్కడినుండి పొందవచ్చు?

  •   దేవుని రాజ్యం ఇప్పుడు మనకోసం ఏమి చేస్తోంది?

 19 సంవత్సరాల బ్రెండ ఇలా చెప్తోంది: “మా క్లాస్‌మేట్‌ ఒకసారి మా కూటాలకు వచ్చాడు. అతను మా కుటుంబంతోనే కూర్చున్నాడు. అతనికి మా పుస్తకాలు చూపించాం. ఆ తర్వాత అతను, మా కూటాలు ఎంతో బాగున్నాయని, ముఖ్యంగా ప్రశ్నా-జవాబుల భాగంలో ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యానాలు అతనికి బాగా నచ్చాయని చెప్పాడు. అంతేకాకుండా మన దగ్గర ఉన్నలాంటి ప్రచురణలు వాళ్ల చర్చిలో లేవని అన్నాడు.”

 మీకు తెలుసా? రాజ్యమందిరంలో ప్రవేశం ఉచితం, పైగా ఎటువంటి చందాలు సేకరించబడవు.

 అక్కడున్న సహవాసం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. క్రైస్తవులు కూటాలకు హాజరవ్వడానికి గల ఒక కారణాన్ని బైబిలు ఇలా చెప్తుంది, “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉందాం.” (హెబ్రీయులు 10:24, 25) స్వార్థంతో నిండివున్న ఈ లోకంలో తమ గురించి కన్నా దేవుని గురించి, ఇతరుల గురించి పట్టించుకునే ప్రజలతో సహవసించడం ఎంతో సంతోషాన్నిస్తుంది.

 15 సంవత్సరాల ఏలీజా ఇలా చెప్తోంది: “రోజంతా పనిచేయడం వల్ల బాగా అలసటగా, నీరసంగా అనిపించేది. కానీ రాజ్యమందిరానికి రాగానే అక్కడున్న సహోదరులు నన్ను ఎంతో ప్రోత్సహించేవాళ్లు. దానివల్ల కూటం అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించేది, మరో రోజును ఎదుర్కోవడానికి కావల్సిన బలం వచ్చేది.”

 మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 60,000 కన్నా ఎక్కువ స్థలాల్లో 1,20,000 కన్నా ఎక్కువ యెహోవాసాక్షుల సంఘాలు ఉన్నాయి. కూటాలకు హాజరయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్న కారణంగా ప్రతీ సంవత్సరం సగటున 1500 కొత్త రాజ్యమందిరాల్ని కడుతున్నారు. a

a కూటాలు ఎక్కడ జరుగుతాయో తెలుసుకోవడానికి, “యెహోవాసాక్షుల సంఘ కూటాలు” అనే వెబ్‌ పేజీకి వెళ్లి అక్కడ “మీకు దగ్గర్లో ఉన్న ప్రాంతాన్ని కనుక్కోండి” అనే దానిమీద క్లిక్‌ చేయండి.