కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ గురించి నేనేమి తెలుసుకోవాలి?

ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ గురించి నేనేమి తెలుసుకోవాలి?

 ఎలక్ట్రానిక్‌ గేమ్‌ గురించి క్విజ్‌

 ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ బాగా అమ్ముడుబోయే అమెరికాలో. . .

  1.   ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ ఆడేవాళ్ల సగటు వయసు ఎంత?

    1.   18

    2.   30

  2.   ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ ఆడే పురుషుల, స్త్రీల శాతం ఎంత?

    1.   55 శాతం మగవాళ్లు; 45 శాతం ఆడవాళ్లు

    2.   15 శాతం మగవాళ్లు; 85 శాతం ఆడవాళ్లు

  3.   ఈ కింది వాటిలో ఏ వయసువాళ్లు ఎక్కువగా ఈ గేమ్స్‌ ఆడతారు?

    1.   18 లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న ఆడవాళ్లు

    2.   17 లేదా అంతకన్నా తక్కువ వయసున్న అబ్బాయిలు

 జవాబులు (2013లో సేకరించిన సమాచారం ప్రకారం):

  1.   B. 30.

  2.   A. 45 శాతం ఆడవాళ్లు, ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ ఆడేవాళ్లందరిలో సగంమంది వాళ్లే.

  3.   A.ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ ఆడేవాళ్లలో 18 లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న ఆడవాళ్లు 31 శాతం ఉన్నారు. 17 లేదా అంతకన్నా తక్కువ వయసున్న అబ్బాయిలు 19 శాతం ఉన్నారు.

 ఈ సమాచారాన్ని బట్టి ఆడేవాళ్లు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ ఆడడంవల్ల వచ్చేవి మంచి ఫలితాలో లేదా చెడ్డ ఫలితాలో వీటినిబట్టి మీకు అర్థంకాదు.

 మంచి

 ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ గురించి ఈ కింది ఇచ్చిన వాక్యాల్లో మీరు వేటిని నిజమని చెప్తారు?

  •  “కుటుంబసభ్యులతో, స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకోవడానికి ఇవి పనికొస్తాయి.”—ఈరీన్‌.

  •  “చుట్టూ ఏమి జరుగుతుందో మర్చిపోయేలా చేస్తాయి.”—ఆనెట్‌.

  •  “మీ జ్ఞానేంద్రియాలను ఇవి పదును పెడతాయి.”—క్రిస్టఫర్‌.

  •  “సమస్యల్ని ఎలా పరిష్కరించాలో ఈ గేమ్స్‌ మీకు నేర్పిస్తాయి.”—ఏమీ.

  •  “మీ మెదడుకు ఎక్కువ పని ఉంటుంది. ఆలోచించడం, ప్లాన్‌ చేయడం, ఓ వ్యూహం ఎలా చేయాలో అవి మీకు నేర్పిస్తాయి.”—ఆంథనీ.

  •  “స్నేహితులతో కలిసి ఆడుకునేలా కొన్ని గేమ్స్‌ ఉంటాయి.”—థామస్‌.

  •  “మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి కొన్ని గేమ్స్‌ సహాయం చేస్తాయి.”—జేయల్‌.

 వీటిలో కొన్నిటికి మీరు అవునని అంటారా లేదా అన్నీ నిజమేనని అంటారా? కొన్ని వీడియో గేమ్‌లు కేవలం కాలక్షేపానికే పనికొచ్చినప్పటికి కొన్ని రకాల వీడియో గేమ్‌లవల్ల మాత్రం మీ మనసుకు, శరీరానికి కొన్ని లాభాలు ఉండవచ్చు. ఆనెట్‌ చెప్పినట్లు, “చుట్టూ ఏమి జరుగుతుందో మర్చిపోయేలా చేస్తాయి.” అది అన్నిసార్లు తప్పేమీ కాదు.

 ● సరదాగా గడపడానికే కాదు “ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు” అని బైబిలు చెప్తుంది.—ప్రసంగి 3:1-4.

 చెడు

 ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ మీ టైంను తినేస్తున్నాయా?

 “ఒక్కసారి ఆడడం మొదలుపెట్టానంటే, అస్సలు ఆపాలనిపించదు. ఇంకొక్క ‘లెవల్‌ ఆడి ఆపేస్తాను’ అని అనుకుంటూ ఉంటాను. కానీ నాకు తెలీకుండానే రెండు గంటల వరకు ఆడుతూనే ఉంటాను. అలా గేమ్స్‌ ఆడుతూ చాలా సమయం స్క్రీన్‌ ముందే కూర్చుండిపోతాను.”—ఆనెట్‌.

 “వీడియో గేమ్‌లు మన టైంను తినేస్తాయి. గంటలుకొద్దీ ఆ గేమ్స్‌ ఆడుతూ కూర్చున్నాక మీకు ఏదో సాధించినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి ఐదు గేమ్‌లు మీరు గెలిచి ఉంటారు. కానీ నిజానికి ఆ గేమ్స్‌ ఆడి మీరు సాధించింది ఏమీ ఉండదు.”—సెరీన.

 ఒక్కమాటలో: మీరు ఒకవేళ డబ్బును పోగొట్టుకుంటే తర్వాత సంపాదించుకోగలరు. కానీ టైంను తిరిగి తెచ్చుకోలేరు. అంటే టైం డబ్బు కన్నా విలువైనది అన్నమాట. కాబట్టి టైం వేస్ట్‌ చేసుకోకండి.

 ● బైబిలు ఇలా చెప్తోంది: “సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు ... జ్ఞానము కలిగి నడుచుకొనుడి.”—కొలొస్సయులు 4:5.

 ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ ఆడడంవల్ల మీ ఆలోచనల్లో ఏవైనా మార్పులు వస్తున్నాయా?

 “బయట ఏ నేరాల్ని చేస్తే జైలుశిక్ష లేదా ఉరిశిక్ష వేస్తారో, అలాంటి పనుల్ని వీడియో గేమ్స్‌లో అస్సలు ఆలోచించకుండా చేసేస్తారు.”—సెత్‌.

 “చాలా వీడియో గేమ్స్‌లో, మీరు గెలవాలంటే మీ శత్రువుల్ని ఓడించాల్సి ఉంటుంది. అందుకోసం వాళ్లను రకరకాల క్రూరమైన పద్ధతుల్లో కూడా చంపాల్సి వస్తుంది.”—ఆనెట్‌.

 “మీరు నమ్మలేని ఓ విషయమేమిటంటే, ఆ గేమ్స్‌ ఆడడంలో మునిగిపోయి మీ ఫ్రెండ్స్‌ను ఎలాంటి మాటలు అంటున్నారో కూడా మీకు తెలీదు. వాళ్లను ‘చచ్చిపో!’ లేదా ‘చంపేస్తాను’ అని అంటుంటారు.”—నేథన్‌.

 ఒక్కమాటలో: హింస, సెక్స్‌, మంత్రతంత్రాలు వంటి దేవుడు ఇష్టపడని వాటిని ప్రోత్సహించే ఆటల్ని ఆడకండి.—గలతీయులు 5:19-21; ఎఫెసీయులు 5:10; 1 యోహాను 2:15, 16.

 ● కేవలం హింసించేవాళ్లను మాత్రమే కాదు, “బలత్కారాసక్తులను” అంటే హింసను ఇష్టపడేవాళ్లను కూడా యెహోవా అసహ్యించుకుంటాడని బైబిలు చెప్తుంది. (కీర్తన 11:5) మీరు ఆడే వీడియో గేమ్స్‌వల్ల మీరు భవిష్యత్తులో ఎలా తయారవుతారో తెలీకపోయినా, ప్రస్తుతం మీరు ఎలాంటి వ్యక్తో మాత్రం తెలుస్తుంది.

 ఆలోచించండి: గెట్టింగ్‌ టు కామ్‌ అనే పుస్తకం ఏం చెప్తుందంటే, “టీవీ చూడడంవల్ల కన్నా హింస ఉండే వీడియో గేమ్‌లు ఆడడంవల్ల ప్రవర్తనలో ఎక్కువ మార్పు వస్తుంది. ఎందుకంటే క్రూరుంగా ప్రవర్తిస్తూ, అవతలి వ్యక్తి రక్తాన్ని కళ్లజూసే హీరోను పిల్లలు కేవలం చూడడంకాదు పిల్లలే ఆ గేమ్‌లో హీరోలు. ఆటలు ఆడడంవల్ల చాలా విషయాలు నేర్చుకుంటారు. నిజానికి ఆ గేమ్‌లు వాళ్లకు హింసను నూరిపోస్తున్నాయి.”—యెషయా 2:4 పోల్చండి.

 అసలు నిజమేంటి

 వీడియో గేమ్స్‌ ఆడుతూ మరీ ఎక్కువ సమయం వేస్ట్‌ చేయకూడదంటే ఏం చేయాలో చాలామంది పిల్లలు తెలుసుకున్నారు. వాళ్లలో ఇద్దరు ఏం చెప్తున్నారో చూడండి.

 “ఐదు గంటలు నిద్రపోతే సరిపోతుంది కదా? ఇంకొక్క లెవలే ఆడతాను అని అనుకుంటూ, నేను చాలా ఆలస్యం అయ్యేదాకా వీడియో గేమ్స్‌ ఆడుతూ ఉండేవాణ్ణి. అయితే అలా చేయకూడదంటే ఏం చేయాలో నేను నేర్చుకున్నాను. వాటిని ఆడడం కేవలం అప్పుడప్పుడు చేసే హాబీలా మాత్రమే నేను చూస్తాను. ప్రతీ విషయానికి ఓ హద్దు ఉంటుంది.”—జోసెఫ్‌.

 “ఆటలు ఆడడం తగ్గించడంవల్ల నేను చాలా పనులు చేయగలుగుతున్నాను. ఎక్కువ టైం ప్రీచింగ్‌ చేయగలుగుతున్నాను, సంఘంలోనివాళ్లకు సహాయం చేయగలుగుతున్నాను, మ్యూజిక్‌ కూడా నేర్చుకుంటున్నాను. ఆటలు మాత్రమే కాదు వేరే ప్రపంచం కూడా ఉందని తెలుసుకున్నాను.”—డేవిడ్‌.

 ● మంచిచెడ్డలేమిటో బాగా తెలిసిన స్త్రీపురుషులు అన్నిట్లో మితంగా ఉంటారని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 3:2, 11) వాళ్లు సరదాగా సమయం గడుపుతారు. కానీ ఎంత సమయం ఆడాలో కూడా వాళ్లకు తెలుసు. కేవలం తెలియడమే కాదు వాళ్లు సమయం ప్రకారం వాటిని ఆపేయగలుగుతారు కూడా.—ఎఫెసీయులు 5:10.

 ఒక్కమాటలో: కేవలం కొద్ది సయయమే ఆడితే వీడియో గేమ్స్‌ ఆడడం సరదాగా ఉంటుంది. కానీ పూర్తి సమయాన్ని ఆటలు ఆడుతూనే గడిపేయకండి లేదా వేరే ముఖ్యమైన పనులు చేయడానికి టైం సరిపోనంతగా ఆటలు ఆడకండి. గేమ్‌లో గోల్‌ కొట్టడానికి ప్రయత్నిస్తూ మరీ ఎక్కువ టైం గడపడం కన్నా, ఆ సమయాన్నీ శక్తిన్నీ జీవితంలో గెలవడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది?