కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను సారీ ఎందుకు చెప్పాలి?

నేను సారీ ఎందుకు చెప్పాలి?

 ఈ సందర్భాల్లో మీరైతే ఏం చేస్తారు?

  1.   క్లాస్‌లో అల్లరి చేస్తున్నారని మీ టీచర్‌ మిమ్మల్ని తిడితే...

     చిన్న విషయానికే ఆయన మిమ్మల్ని తిట్టాడని మీకు అనిపించినా, ఆయనకు సారీ చెప్పాలా?

  2.   మీరు అన్న మాటకు మీ ఫ్రెండ్‌ బాధపడిందని తెలిస్తే...

     మీరు మాట్లాడింది నిజమే అని మీకు అనిపించినా, తనకు సారీ చెప్పాలా?

  3.   మీ డాడీ మీద కొపమొచ్చి, ఆయనతో గౌరవం లేకుండా మాట్లాడితే...

     ఆయన చేసినదానికే మీకు కోపం వచ్చిందని అనిపించినా, సారీ చెప్పాలా?

 పైన ఉన్న మూడు ప్రశ్నలకు సారీ చెప్పాలి అనేదే జవాబు. అయితే తప్పు మీ వైపు పూర్తిగా లేదని మీకు అనిపించినా, ఎందుకు సారీ చెప్పాలి?

 ఎందుకు సారీ చెప్పాలి?

  •   సారీ చెప్పడం వల్ల మీరు పెద్దరికంగా ఆలోచిస్తున్నారని చూపిస్తారు. మీరు చేసిన పనికి లేదా అన్న మాటకి బాధ్యత తీసుకుని సారీ చెప్తే, పెద్దయ్యాక అవసరమయ్యే ముఖ్యమైన లక్షణాల్ని ఇప్పటినుంచే పెంచుకుంటున్నారని చూపిస్తారు.

     “వినయం, ఓపిక ఉంటే సారీ చెప్తాం, వేరేవాళ్లు చెప్పేది వింటాం.”—రేచెల్‌.

  •   సారీ చెప్పడం వల్ల మీరు ఇతరులతో సమాధానంగా ఉండగలుగుతారు. సారీ చెప్పేవాళ్లు సమాధానపడడానికే చూస్తారు గానీ వాళ్లదే కరెక్ట్‌ అని, అవతలి వాళ్లది తప్పు అని నిరూపించుకోవడానికి చూడరు.

     “మీ తప్పేమీ లేకపోయినా సమాధానపడడానికే చూడాలి. ‘సారీ’ చెప్పడం వల్ల నష్టం ఏమీ లేదు. పైగా మీ స్నేహమే బాగుంటుంది.”—మిరియమ్‌.

  •   సారీ చెప్తే మీకే మంచిగా అనిపిస్తుంది. మీ మాటలవల్ల, పనులవల్ల ఎవరైనా నొచ్చుకున్నారని మీకు అనిపిస్తే, అది పెద్ద బండరాయి మోస్తున్నట్లు ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు సారీ చెప్పేస్తే, మీ భుజాలమీద నుండి ఆ భారాన్ని దించేసుకున్నట్లు మీకు అనిపిస్తుంది. a

     “కొన్నిసార్లు నేను మమ్మీడాడీతో గౌరవం లేకుండా మాట్లాడేదాన్ని. మాట్లాడాక నాకు బాధగా అనిపించినా, సారీ చెప్పడం మాత్రం కష్టంగా ఉండేది. అయితే ఒక్కసారి సారీ చెప్పాక మా ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండేది. నాకు కూడా హాయిగా అనిపించేది.”—నియా.

    సారీ చెప్పకపోవడం వల్ల పెద్ద బరువు మోస్తున్నట్లు ఉంటుంది; ఒక్కసారి చెప్పేస్తే, ఆ బరువు దిగిపోయినట్లు ఉంటుంది

 సారీ చెప్పడం అంత తేలిక కాదు. దీనా అనే 26 ఏళ్ల అమ్మాయి వాళ్ల అమ్మతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడేది. దానివల్ల ఆమె చాలాసార్లు సారీ చెప్పాల్సి వచ్చింది. దీనా ఇలా ఒప్పుకుంటుంది: “సారీ చెప్పడం అంత ఈజీ కాదు. అలా చెప్పాల్సి వస్తే, నా గొంతులో ఏదో అడ్డుపడి మాటలు బయటికి రానట్లు అనిపిస్తుంది.”

 సారీ ఎలా చెప్పాలి?

  •   కుదిరితే నేరుగా కలిసి సారీ చెప్పండి. నేరుగా కలిసి సారీ చెప్తే తప్పు చేసినందుకు మీరు బాధపడుతున్నారని అవతలి వ్యక్తికి అర్థమౌతుంది. ‘సారీ’ అని మెసేజ్‌తో పాటు బాధగా ఉన్న ఈమోజీ పెట్టినా, అవతలి వాళ్లు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు లేదా మీరు నిజాయితీగా సారీ చెప్తున్నట్లు వాళ్లకు అనిపించకపోవచ్చు.

     సలహా: మీకు నేరుగా కలిసి సారీ చెప్పడం కుదరకపోతే ఫోన్‌ చేసిగానీ, కార్డ్‌లో రాసిగానీ సారీ చెప్పడానికి ప్రయత్నించండి. మీరు ఏ పద్ధతిలో సారీ చెప్పినా మీ పదాల్ని జాగ్రత్తగా ఎంచుకోండి.

     బైబిలు సలహా: “నీతిమంతుడి హృదయం జవాబిచ్చే ముందు ధ్యానిస్తుంది.”—సామెతలు 15:28.

  •   వెంటనే సారీ చెప్పండి. మీరు సారీ చెప్పడానికి ఎంత ఆలస్యం చేస్తే, సమస్య అంత పెద్దదౌతుంది. మీకూ, మీరు బాధపెట్టిన వ్యక్తికి మధ్య దూరం పెరుగుతుంది.

     సలహా: మీరు ఈ లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. ఉదాహరణకు, ‘నేను ఈరోజు సారీ చెప్తాను.’ మీరు ఎప్పటికల్లా సారీ చెప్పాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి, దానికి కట్టుబడి ఉండండి.

     బైబిలు సలహా: “త్వరగా … రాజీపడు.”—మత్తయి 5:25.

  •   నిజాయితీగా సారీ చెప్పండి. “మీకలా అనిపిస్తే సారీ” అని చెప్తే, నిజంగా సారీ చెప్పినట్లు అవ్వదు. “ఒకవేళ మీరు చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకుంటూ సారీ చెప్తే, మీవల్ల బాధపడిన వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా గౌరవిస్తాడు” అని 25 ఏళ్ల జానెల్‌ చెప్తుంది.

     సలహా: సారీ చెప్పడానికి కండీషన్లు పెట్టకండి. “నేను చేసినదానికి సారీ చెప్పాలంటే ముందు నువ్వు చేసినదానికి సారీ చెప్పాలి” అని అనకండి.

     బైబిలు సలహా: “ఇతరులతో శాంతిగా ఉండడానికి … చేయగలిగినదంతా చేద్దాం.”—రోమీయులు 14:19.

a మీరొకవేళ వేరేవాళ్ల వస్తువుని పోగొట్టినా లేదా పాడుచేసినా, వాళ్లకు సారీ చెప్పడంతోపాటు ఆ వస్తువుకు సరిపడా డబ్బులు ఇవ్వడం లేదా రిపేర్‌ చేయించడం మంచిది.