కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు ప్రశ్నలకు జవాబులు

బైబిలు ప్రశ్నలకు జవాబులు

అన్ని ప్రార్థనలు దేవుడు వింటాడా?

అన్ని దేశాల ప్రజలు చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. (కీర్తన 145:18, 19) మనకు ఆందోళన కలిగించే ఏ విషయం గురించైనా తనతో చెప్పమని దేవుని వాక్యమైన బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (ఫిలిప్పీయులు 4:6, 7) అయితే, కొన్ని ప్రార్థనలు దేవునికి నచ్చవు. ఉదాహరణకు, బట్టీపట్టి పదేపదే వల్లించే ప్రార్థనలను దేవుడు ఇష్టపడడు.​—మత్తయి 6:7 చదవండి.

అంతేకాదు, కావాలని తన ఆజ్ఞల్ని మీరేవాళ్ల ప్రార్థనలు యెహోవాకు అసహ్యం. (సామెతలు 28:9) ఉదాహరణకు, పూర్వం కొందరు ఇశ్రాయేలీయుల చేతులు రక్తంతో తడిసిపోయినందువల్ల దేవుడు వాళ్ల ప్రార్థనలు వినలేదు. దీన్నిబట్టి, దేవుడు మన ప్రార్థనలు వినాలంటే కొన్ని షరతులు ఉన్నాయని స్పష్టమౌతోంది.​—యెషయా 1:15 చదవండి.

దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం ఏమి చేయాలి?

విశ్వాసం లేకుండా మనం దేవునికి ప్రార్థించలేం. (యాకోబు 1:5, 6) దేవుడు ఉన్నాడని, మనమంటే ఆయనకు పట్టింపు ఉందని మనం నమ్మాలి. బైబిలు అధ్యయనం చేసి మన విశ్వాసాన్ని బలపర్చుకోవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్న రుజువులు, హామీలే నిజమైన విశ్వాసానికి ఆధారం.​—హెబ్రీయులు 11:1, 6 చదవండి.

మనం నిజాయితీగా, వినయంగా ప్రార్థించాలి. దేవుని కుమారుడు యేసు కూడా, ప్రార్థిస్తున్నప్పుడు వినయాన్ని చూపించాడు. (లూకా 22:41, 42) కాబట్టి, తాను ఏమి చేయాలో మనం దేవునికి చెప్పే బదులు, బైబిలు చదివి ఆయన ఏమి కోరుతున్నాడో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు మనం దేవుని ఇష్టానికి తగినట్లుగా ప్రార్థించగలుగుతాం.​—1 యోహాను 5:14 చదవండి. (w13-E 08/01)