కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యుక్రెయిన్‌పై రష్యా దాడి

యుక్రెయిన్‌పై రష్యా దాడి

 2022, ఫిబ్రవరి 24, తెల్లవారుజామున, రష్యా తన యుద్ధ సైన్యంతో యుక్రెయిన్‌పై దాడి మొదలుపెట్టింది. అప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధం జరగకుండా చూడడానికి ప్రపంచ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నా, రష్యా ఇలా దాడికి సిద్ధమైంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచానికి ఎలాంటి నష్టం రావచ్చు? ఈ యుద్ధం వల్ల ‘మనుషులు పడే బాధలు, యుద్ధం సృష్టించే బీభత్సం, అలాగే ఐరోపా దేశాల, ప్రపంచ దేశాల భద్రతకు కలిగే ముప్పు, వీటన్నిటికీ ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఊహించలేం’ అని కొన్ని రోజుల క్రితం ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ-జనరల్‌ ఆంటోన్యో గ్యూటేరెష్‌ అన్నాడు.

బైబిలు ప్రకారం, ఇలాంటి సంఘటనల్ని ఎలా అర్థంచేసుకోవాలి?

  •   “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం” దాడిచేసే కాలం గురించి యేసుక్రీస్తు ప్రవచించాడు లేదా ముందే చెప్పాడు. (మత్తయి 24:7) మన కాలంలో జరుగుతున్న యుద్ధాలు యేసు ప్రవచన నెరవేర్పే అని బైబిలు చూపిస్తోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి “‘చివరి రోజులు’ లేదా ‘అంత్యదినముల’ సూచన ఏమిటి?” అనే ఆర్టికల్‌ చదవండి.

  •   బైబిల్లోని ప్రకటన పుస్తకం, యుద్ధాన్ని ‘ఎర్రటి గుర్రం మీద కూర్చొని, భూమ్మీద శాంతి లేకుండా’ చేసే వ్యక్తితో పోలుస్తోంది. (ప్రకటన 6:4) ఈ ప్రవచనం నేడు జరుగుతున్న యుద్ధాల గురించే మాట్లాడుతోందని అర్థం చేసుకోవడానికి “నాలుగు గుర్రాల మీద స్వారీ చేస్తున్న వ్యక్తులు ఎవరు?” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్‌ చదవండి.

  •   “ఉత్తర రాజు,” “దక్షిణ రాజు” మధ్య శత్రుత్వం ఉంటుందని బైబిల్లోని దానియేలు పుస్తకం ముందే చెప్పింది. (దానియేలు 11:25-45) రష్యా అలాగే దానికి మద్దతిచ్చే దేశాలే ఉత్తర రాజు a అని ఎందుకు చెప్పవచ్చో తెలుసుకోవడానికి, నెరవేరిన ప్రవచనాలు—దానియేలు 11వ అధ్యాయం అనే వీడియో చూడండి.

  •   బైబిల్లోని ప్రకటన పుస్తకం, “సర్వశక్తిమంతుడైన దేవుని ​మహారోజున జరిగే యుద్ధం” గురించి కూడా మాట్లాడుతోంది. (ప్రకటన 16:14, 16) అయితే ఈ యుద్ధం, ఇప్పుడు మన కళ్లెదుట దేశాలు చేసుకుంటున్న యుద్ధాల్లాంటిది కాదు. భవిష్యత్తులో జరగబోయే ఆ సంఘటన గురించి తెలుసుకోవడానికి, “హార్‌మెగిద్దోను యుద్ధం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చదవండి.

ఇలాంటి పరిస్థితుల్లో, భవిష్యత్తు మీద మీరెలా ఆశ పెట్టుకోవచ్చు?

  •   దేవుడు “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు” అని బైబిలు చెప్తోంది. (కీర్తన 46:9) దేవుడు మాటిస్తున్న ఆ మంచి భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి, “మంచి రోజులు వస్తాయనే నిజమైన ఆశ” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్‌ చదవండి.

  •   దేవుని రాజ్యం రావాలని ప్రార్థించమని యేసు తన శిష్యులకు చెప్పాడు. (మత్తయి 6:9, 10) ఆ రాజ్యం పరలోక ప్రభుత్వం. అది ఈ భూమ్మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చి, ప్రపంచ శాంతి ఉండేలా చేస్తుంది. దేవుని రాజ్యం వల్ల మీకు కలిగే దీవెనలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి, దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే వీడియో చూడండి.

 యుక్రెయిన్‌లో 1,29,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు ఉన్నారు. వేరే దేశాల్లో ఉన్న యెహోవాసాక్షుల్లాగే వీళ్లు కూడా యేసును ఆదర్శంగా తీసుకుంటూ రాజకీయాల్లో తలదూర్చరు, యుద్ధాల్లో పాల్గొనరు. (యోహాను 18:36) యుద్ధాలతో సహా, మనుషుల సమస్యలన్నిటికీ దేవుని రాజ్యమే పరిష్కారాన్ని ఇస్తుందనే మంచివార్తను యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నారు. (మత్తయి 24:14) భవిష్యత్తు మీద ఆశను నింపే బైబిలు సందేశం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.

a ఈ ప్రవచనం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, “అంత్యకాలంలో ‘ఉత్తర రాజు’” అనే ఆర్టికల్‌ని, అలాగే “నేడు ‘ఉత్తర రాజు’ ఎవరు?” అనే ఆర్టికల్‌ని చదవండి.