కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

“నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో”

“నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో”

సొలొమోను రాజు పవిత్రశక్తి ప్రేరణతో ఇలా రాశాడు: “అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో.” (సామె 4:23) విచారకరంగా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు యెహోవా ముందు “నిండు హృదయంతో” నడుచుకోవడం మానేశారు. (2ది 6:14) చివరికి సొలొమోను కూడా వేరే దేశాల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, వాళ్లు ఆయన హృదయాన్ని తిప్పేశారు. దాంతో సొలొమోను అబద్ధ దేవుళ్లను ఆరాధించాడు. (1రా 11:4) మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు? ఈ ప్రశ్నతోనే 2019, జనవరి కావలికోట 14-19 పేజీల్లో ఒక అధ్యయన ఆర్టికల్‌ ఉంది.

కావలికోట నేర్పించే పాఠాలు—మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు? వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

విశ్వాసాన్ని బలహీనపర్చే ఎలాంటి పరిస్థితి ఈ క్రైస్తవులకు ఎదురైంది? కానీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఈ అధ్యయన ఆర్టికల్‌ వాళ్లకు ఎలా సహాయం చేసింది?

  • బ్రెంట్‌, లారెన్‌

  • అమ్‌జె

  • హ్యాపీ లేయు

ఈ అధ్యయన ఆర్టికల్‌ మీకెలా సహాయం చేసింది?