కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అలాంటి వాళ్లను ఘనపర్చండి’

‘అలాంటి వాళ్లను ఘనపర్చండి’

పరిపాలక సభలో ఉన్న కమిటీలకు సహాయం చేయడానికి అనుభవం, పరిణతిగల పెద్దల్ని పరిపాలక సభ 1992 నుండి నియమిస్తోంది. a ‘వేరేగొర్రెలకు’ చెందిన ఈ సహోదరులు ఆ కమిటీలకు సహాయకులుగా సేవ చేస్తూ పరిపాలక సభకు చక్కగా మద్దతిస్తారు. (యోహా. 10:16) వాళ్లు ఏ కమిటీకి సహాయకులుగా ఉన్నారో, ఆ కమిటీ ప్రతీవారం జరుపుకునే మీటింగ్‌కు హాజరౌతారు. అక్కడ చర్చించబోయే విషయానికి సంబంధించిన సమాచారాన్ని వాళ్లు కమిటీ ముందు ఉంచడంతోపాటు కొన్ని సలహాల్ని కూడా సూచిస్తారు. అయితే తుది నిర్ణయం పరిపాలక సభ సభ్యులే తీసుకుంటారు. వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం ఈ సహాయకుల బాధ్యత. పరిపాలక సభ తమకు అప్పగించిన ఏ పనినైనా వాళ్లు సంతోషంగా చేస్తారు. వాళ్లు పరిపాలక సభ సభ్యులతో కలిసి ప్రత్యేక సమావేశాలకు, అంతర్జాతీయ సమావేశాలకు హాజరౌతారు. అంతేకాదు, కొన్నిసార్లు ప్రధాన కార్యాలయ ప్రతినిధులుగా బ్రాంచి కార్యాలయాలను సందర్శిస్తారు.

ఆ ఏర్పాటు మొదలైనప్పటి నుంచి అలా సహాయకునిగా సేవచేస్తున్న ఓ సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “నాకు అప్పగించిన పనుల్ని నేను సరిగ్గా చేస్తే, పరిపాలక సభ ఆధ్యాత్మిక విషయాలపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతుంది.” దాదాపు 20 ఏళ్లు నుండి సహాయకునిగా సేవచేస్తున్న మరో సహోదరుడు ఇలా చెప్తున్నాడు, ‘ఇలా సేవచేయడం నేను ఎప్పటికీ ఊహించలేని ఓ గొప్ప అవకాశం.’

పరిపాలక సభ ఈ సహాయకులకు ఎన్నో బాధ్యతల్ని అప్పగిస్తుంది. అంతేకాదు వాళ్లు ఎంతో నమ్మకంగా, కష్టపడి చేస్తున్న సేవను చాలా విలువైనదిగా ఎంచుతుంది. కాబట్టి మనందరం ‘అలాంటి వాళ్లను ఘనపరుద్దాం.’—ఫిలి. 2:29, 30.

a పరిపాలక సభలోని ఆరు కమిటీలు, వాటి బాధ్యతల గురించి తెలుసుకోవడానికి కావలికోట మే 15, 2008 సంచికలో 29వ పేజీ చూడండి.