కంటెంట్‌కు వెళ్లు

ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?

ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిల్లోని ప్రకటన గ్రంథానికి గ్రీకులో, అపోకలిప్స్‌ అని పేరు. దానికి, “ముసుగు తీయడం” లేదా “వెల్లడించడం” అని అర్థం. ఆ పేరులోనే, ప్రకటన గ్రంథానికున్న అర్థమేమిటో తెలుస్తుంది. అదేంటంటే, కొంతకాలంగా రహస్యంగా ఉన్న వాటిపై ముసుగును అది తీసేస్తుంది, చాలాకాలం తర్వాత జరగబోయే సంఘటనలను అది వెల్లడిచేస్తుంది. ప్రకటన గ్రంథంలోని చాలా ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉన్నాయి.

ప్రకటన గ్రంథంలో ఏమున్నాయి

  •   ముందుమాట.—ప్రకటన 1:1-9.

  •   ఏడు సంఘాలకు యేసు చెప్పిన సందేశం.—ప్రకటన 1:10-3:22.

  •   పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవుని దర్శనం.—ప్రకటన 4:1-11.

  •   వరుస దర్శనాలు, ప్రతీ దర్శనం తర్వాతి దానికి ముడిపడి ఉంటుంది.

    •   ఏడు ముద్రలు.—ప్రకటన 5:1-8:6.

    •   ఏడు బూరలు. చివరి మూడు, మూడు శ్రమల్ని తీసుకొస్తాయి.—ప్రకటన 8:7-14:20.

    •   ఏడు పాత్రలు. భూమ్మీద కుమ్మరించే ఈ పాత్రల్లోని ప్రతీదానిలో దేవుని తీర్పును సూచించే తెగుళ్లు ఉంటాయి.—ప్రకటన 15:1-16:21.

    •   దేవుని శత్రువుల నాశనానికి సంబంధించిన దర్శనాలు.—ప్రకటన 17:1-20:10.

    •   దేవుడు పరలోకానికి, భూమికి ఇచ్చే ఆశీర్వాదాలకు సంబంధించిన దర్శనాలు.—ప్రకటన 20:11-22:5.

  •   ముగింపు.—ప్రకటన 22:6-21.

ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసే విషయాలు

  1.   ఈ పుస్తకంలోని అర్థం మంచిది, దేవుని సేవకులను భయపెట్టేది కాదు, బెదిరించేది కాదు. చాలామంది “అపోకలిప్స్‌” అనే పదాన్ని సర్వనాశనంతో ముడిపెడతారు, కానీ ప్రకటన గ్రంథంలోని సందేశాన్ని చదివి, అర్థం చేసుకుని, పాటించినవాళ్లు సంతోషంగా ఉంటారన్న మాటలే ఆ పుస్తకం మొదట్లోనూ, చివర్లోనూ ఉన్నాయి.—ప్రకటన 1:3; 22:7.

  2.   ప్రకటన గ్రంథంలో ఎన్నో ‘సూచనలు,’ గుర్తులు ఉన్నాయి, అవి వేటిని సూచిస్తున్నాయో తెలుసుకుని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.—ప్రకటన 1:1.

  3.   ప్రకటన గ్రంథంలోని ఎన్నో ప్రాముఖ్యమైన విషయాల్ని, గుర్తుల్ని దానికి ముందున్న పుస్తకాలే పరిచయం చేసేశాయి:

  4.   దర్శనాలు అన్నీ ‘ప్రభువు దినానికి’ సంబంధించినవి. ఆ “ప్రభువు దినం,” 1914లో దేవుని రాజ్య స్థాపన జరిగినప్పుడు, రాజుగా యేసు పరిపాలన ప్రారంభించినప్పుడు మొదలైంది. (ప్రకటన 1:10) అంటే ప్రకటన గ్రంథంలోని విషయాల అసలైన నెరవేర్పు మన కాలంలోనే జరుగుతుందని మనం ఆశించవచ్చు.

  5.   మనం బైబిలును అర్థం చేసుకోవాలంటే మనకు దేవుడు ఇచ్చే జ్ఞానం కావాలి, దాన్ని ఇప్పటికే అర్థం చేసుకున్నవాళ్లు మనకు సహాయం చేయాలి. అలాగే ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అవే అవసరం.—అపొస్తలుల కార్యములు 8:26-39; యాకోబు 1:5.