కంటెంట్‌కు వెళ్లు

బ్రదర్‌ వేలెరీ వ్యాజ్‌నెకోవ్‌

2023 జూలై, 11 | అప్‌డేట్‌: నవంబరు 9, 2023
రష్యా

అప్‌డేట్‌—సహోదరుడు దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది | “యెహోవా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు”

అప్‌డేట్‌—సహోదరుడు దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది | “యెహోవా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు”

నవంబరు 7, 2023 రోజున బ్రదర్‌ వేలెరీ వ్యాజ్‌నెకోవ్‌కి సంబంధించిన కేసులో ప్రిమోర్యీ ప్రాంతంలోని పోజార్స్కీ డిస్ట్రిక్ట్‌ కోర్టు సహోదరుడు దోషి అని తీర్పుతీర్చి, ఆయనకు వాయిదా పద్ధతిలో అమలయ్యే రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష వేసింది. ఆయన ఈ సమయంలో జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు.

ప్రొఫైల్‌

మనం కూడా వేలెరీ లానే దేవుని వాక్యానికి ఉన్న శక్తి మీద ఆధారపడుతూ ఉంటే, మనకు ఎదురయ్యే శ్రమల్ని కూడా విజయవంతంగా సహిస్తాం.—హెబ్రీయులు 4:12.

టైమ్‌లైన్‌

  1. 2018

    లూషెగోర్ష్‌క్‌ నగరంలో యెహోవాసాక్షుల మీద పోలీసులు రహస్యంగా నిఘా పెట్టారు. ఒక అండర్‌ కవర్‌ ఏజెంట్‌ బైబిలంటే ఆసక్తి ఉందని నమ్మించి, యెహోవాసాక్షుల సంభాషణల్ని రహస్యంగా రికార్డ్‌ చేయడం మొదలుపెట్టాడు.

  2. 2021 జూలై, 16

    వేలెరీ మీద క్రిమినల్‌ కేసు పెట్టారు. నిషేధం ఉన్న సంస్థ కార్యకలాపాల్లో ఇతరుల్ని కూడా పాల్గొనేలా చేశాడనే అభియోగం ఆయన మీద వేశారు.

  3. 2022 డిసెంబర్‌, 5

    ప్రయాణించకూడదు అని ఆంక్షలు పెట్టారు

  4. 2023 ఫిబ్రవరి, 9

    క్రిమినల్‌ కేసు మొదలైంది