కంటెంట్‌కు వెళ్లు

సహోదరుడు డీమీట్రీ డోల్జికొవ్‌, ఆయన భార్య మారీనా

మే 2, 2023 | అప్‌డేట్‌ చేయబడింది: జూలై 3, 2023
రష్యా

అప్‌డేట్‌—సహోదరుడు దోషిగా తీర్పు తీర్చబడ్డాడు | విశ్వాసం చూపించినవాళ్ల నుండి ప్రేరణ పొందాడు

అప్‌డేట్‌—సహోదరుడు దోషిగా తీర్పు తీర్చబడ్డాడు | విశ్వాసం చూపించినవాళ్ల నుండి ప్రేరణ పొందాడు

2023 జూన్‌ 30న లెనిన్‌స్కీ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఆఫ్‌ నోవొసిబియిర్స్‌క్‌ సహోదరుడు డీమీట్రీ డోల్జికొవ్‌ని దోషిగా తీర్పుతీర్చి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. జడ్జి ఆ శిక్షను మూడు సంవత్సరాల బలవంతపు సేవకు మార్చాడు. ఈ సమయంలో సహోదరుడు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన ఈ శిక్ష అనుభవించే కాలంలో, ఆయన జీతంలోని 10 శాతం ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఆయన ఆ నగరాన్ని దాటి వెళ్లకూడదు.

ప్రొఫైల్‌

యెహోవా మన విశ్వాసాన్ని, సహనాన్ని గమనించి సహోదరుడు డీమీట్రీకి, అలాగే మనందరికీ కావల్సిన బలాన్ని ఇస్తూనే ఉంటాడని నమ్మకంతో ఉన్నాం.—ప్రకటన 2:19.

టైమ్‌లైన్‌

  1. మే 13, 2022

    క్రిమినల్‌ కేస్‌ మొదలైంది

  2. సెప్టెంబరు 8, 2022

    అపార్ట్‌మెంట్‌ సోదా చేశారు. తాత్కాలిక కస్టడీలో ఉంచారు.

  3. సెప్టెంబరు 9, 2022

    ఇంటరాగేషన్‌ చేసి, విచారణ కోసం చెల్యాబిన్‌స్క్‌ నుండి 1,500 కి.మీ. (932 మైళ్ల) కన్నా దూరంలో ఉన్న నోవొసిబియిర్స్‌క్‌లోని జైలుకు విమానంలో తరలించారు.

  4. నవంబరు 11, 2022

    నేర విచారణ మొదలైంది

  5. నవంబరు 24, 2022

    ఆ జైలు నుండి విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు