కంటెంట్‌కు వెళ్లు

మార్చి 21, 2023
ప్రపంచ వార్తలు

JW.ORG వెబ్‌సైట్‌ పదేళ్ల ప్రయాణం—3వ భాగం

పరిచర్యకు ఉపయోగపడడం

JW.ORG వెబ్‌సైట్‌ పదేళ్ల ప్రయాణం—3వ భాగం

ఈ సిరీస్‌లో ఇంతకుముందు వచ్చిన ఆర్టికల్స్‌లో డిజిటల్‌ రూపంలో ఉన్న మన ప్రచురణలు, వీడియోలను విడుదల చేయడానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరులకు సంబంధించిన ఖచ్చితమైన వార్తల్ని తెలియజేయడానికి jw.org వెబ్‌సైట్‌ ఎలా ఉపయోగపడిందో చూశాం. అయితే ఈ సిరీస్‌లోని చివరి ఆర్టికల్‌లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పనిని ముందుకు తీసుకెళ్లడానికి jw.org వెబ్‌సైట్‌ ఎలా ఉపయోగపడుతుందో చూస్తాం.

భాషలు: 2012 ఆగస్టులో, కొత్తగా డిజైన్‌ చేసిన వెబ్‌సైట్‌ విడుదలైనప్పుడు హోమ్‌ పేజీ 139 భాషల్లో అందుబాటులో ఉంది. అయితే 2014లో వెబ్‌సైట్‌కి సంబంధించిన ప్రచార కార్యక్రమం జరిగింది. అదే సంవత్సరం ఆగస్టు నెల కల్లా మన వెబ్‌సైట్‌ అందుబాటులో ఉన్న భాషల సంఖ్య 500 దాటింది. వాటిలో 22 సంజ్ఞా భాషలు కూడా ఉండడం విశేషం. నేడు వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం 1,070 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది. వాటిలో 100 కన్నా ఎక్కువ సంజ్ఞా భాషలు కూడా ఉన్నాయి.

సమయానుకూలమైన ఆర్టికల్స్‌: 2019 అక్టోబరులో, jw.org వెబ్‌సైట్‌ హోమ్‌ పేజీని కొత్తగా డిజైన్‌ చేశారు. ఈ కొత్త డిజైన్‌లో ఒక ఆకర్షణీయమైన చిత్రమున్న ఆర్టికల్‌, హోమ్‌ పేజీ పైభాగంలో పెద్దగా కనిపిస్తుంది, దానికింద మూడు వేరే ఆర్టికల్స్‌ కూడా ఉంటాయి. ఈ డిజైన్‌ పరిచర్యకు సంబంధించిన సమాచారంపై వెంటనే దృష్టి మళ్లిస్తుంది. కొంతకాలానికి రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అలాగే ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కలిసి ఈ ఆర్టికల్స్‌ అలాగే చిత్రాల్ని ఇంకా వేగవంతంగా తయారు చేయడానికి ఒక కొత్త పద్ధతిని ఏర్పాటు చేశాయి. దాంతో హోమ్‌ పేజీలో ఉన్న సమాచారం ఎప్పుడూ సమయానుకూలంగా, తాజాగా ఉంటుంది. ఉదాహరణకు, హోమ్‌ పేజీలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కోవిడ్‌-19 మహమ్మారి గురించి, రష్యా-యుక్రెయిన్‌ల యుద్ధం గురించి, అలాగే ఆ యుద్ధం బారినపడిన శరణార్థుల పరిస్థితి గురించి ఆర్టికల్స్‌ వచ్చాయి.

మరింత తెలుసుకోవడానికి … : ఆసక్తిపరులు మన సంస్థ గురించి అలాగే మన పని గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి jw.org వెబ్‌సైట్‌ సహాయం చేస్తుంది. ప్రజలు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే యెహోవాసాక్షుల్ని కలిసే అవకాశాన్ని కూడా వెబ్‌సైట్‌ కల్పిస్తుంది. వినికిడి లోపం ఉన్న ఒక ఆమె టీనేజ్‌లో ఉన్నప్పుడు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంది. ఆమె వేరే ప్రాంతానికి వెళ్లిపోవడం వల్ల మళ్లీ వాళ్లను కలవలేకపోయింది. తను బైబిలు స్టడీను కొనసాగించాలనుకుంది కానీ సాక్షులెవ్వరూ తన కొత్త ఇంటి దగ్గర తారసపడలేదు. అప్పుడు ఆమెకు jw.org వెబ్‌సైట్‌ గుర్తొచ్చి “మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి” అనే ఆన్‌లైన్‌ ఫామ్‌ని నింపింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఒక ప్రత్యేక పయినీరు జంట ఆమెను కలిశారు. ఆమె బైబిలు స్టడీను తిరిగి ప్రారంభించడంతో పాటు మీటింగ్స్‌కు కూడా రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె బాప్తిస్మం తీసుకుని తన ముగ్గురి పిల్లలకు యెహోవా గురించి నేర్పిస్తుంది. ఆమె ఇలా అంటుంది: “వెబ్‌సైట్‌ ఇచ్చినందుకు యెహోవాకు ఎంతో థ్యాంక్స్‌, ఎందుకంటే ఆన్‌లైన్‌ ఫామ్‌ లేకపోయుంటే ఎవరో ఒక యెహోవాసాక్షి వచ్చేవరకు నేను అలా ఎదురుచూస్తూ ఉండాల్సిందే.”

ప్రకటనా పని వేగవంతంగా సాగుతుండగా యెహోవా సంస్థ ఆసక్తిపరులకు సహాయం చేయడానికి, శక్తివంతమైన పనిముట్లను ఉపయోగిస్తుందని తెలుసుకోవడం నిజంగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.—యెషయా 60:22.

  • ప్రతీ నెల డౌన్‌లోడ్‌ అయిన వీడియోల సంఖ్య

  • నెలలో ప్రతీ రోజు వెబ్‌సైట్‌ చూసేవాళ్ల సంఖ్య

  • 2013 మార్చి, jw.org అధికారిక లోగో విడుదల

  • 2014 జూలై, సంజ్ఞా భాషల్లో వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది

  • 2019 అక్టోబరు, ప్రజల్ని ఆకట్టుకునేలా హోమ్‌ పేజీని మళ్లీ డిజైన్‌ చేశారు

  • 2021 జనవరి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం విడుదలైనట్టు ప్రకటన