కంటెంట్‌కు వెళ్లు

ఎడమ నుండి కుడికి: సహోదరుడు  తారాస్‌ క్యూజో ఆయన భార్య డార్యా; సహోదరుడు సెర్గె లియులిన్‌; సహోదరుడు  ప్యోటర్‌ జిల్ట్సోవ్‌

సెప్టెంబరు 27, 2022 | 2024, మార్చి 22న అప్‌డేట్‌ అయింది
ప్రపంచ వార్తలు

అప్‌డేట్‌—శిక్ష రద్దుచేయబడింది | యెహోవా సహాయంతో మన సహోదరులు నిరుత్సాహాన్ని అధిగమించారు

అప్‌డేట్‌—శిక్ష రద్దుచేయబడింది | యెహోవా సహాయంతో మన సహోదరులు నిరుత్సాహాన్ని అధిగమించారు

2024, మార్చి 21న సహోదరుడు తారాస్‌ క్యూజో, ఆయన భార్య సహోదరి డార్యా క్యూజో, సహోదరుడు సెర్గె లియులిన్‌ అలాగే ప్యోటర్‌ జిల్ట్సోవ్‌లకు విధించిన శిక్షను సుప్రీం కోర్టు రద్దు చేసింది. సహోదరులను వెంటనే కస్టడీ నుండి విడుదల చేస్తారు. వాళ్ల కేసునురిపబ్లిక్‌ ఆఫ్‌క్రిమియాలోని యాల్టా సిటీ కోర్టుకు పునర్విచారణ కోసం పంపించారు.

2023, ఫిబ్రవరి 27న రిపబ్లిక్‌ ఆఫ్‌క్రిమియాలోని యాల్టా సిటీ కోర్టు సహోదరుడు తారాస్‌ క్యూజో, ఆయన భార్య సహోదరి డార్యా క్యూజో, సహోదరుడు సెర్గె లియులిన్‌ అలాగే ప్యోటర్‌ జిల్ట్సోవ్‌లను దోషులుగా తీర్పు తీర్చింది. డార్యాకు మూడేళ్ల జైలు శిక్ష రద్దచేయబడింది. కాబట్టి తను ఈసారి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. తారాస్‌కు ఆరున్నర సంవత్సరాలు జైలు శిక్ష వేయబడింది. సెర్గె అలాగే ప్యోటర్‌కు ఆరు సంవత్సరాల ఒక నెల జైలు శిక్ష వేశారు. ఈ ముగ్గరు సహోదరుల్ని కోర్టు దగ్గరే కస్టడీలోకి తీసుకున్నారు.

టైమ్‌ లైన్‌

  1. మార్చి 4, 2021

    తీవ్రవాద సంస్థకు నిధులు అందిస్తున్నాడనే నింద మోపి తారాస్‌ మీద క్రిమినల్‌ కేసు పెట్టారు

  2. మార్చి 11, 2021

    క్యూజో జంట, సెర్గె జంట ఇళ్లతో సహా యెహోవాసాక్షుల తొమ్మిది మంది ఇళ్లను సోదా చేశారు. తారాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

  3. మార్చి 12, 2021

    తారాస్‌ను విడుదల చేసి హౌస్‌ అరెస్టులో ఉంచారు, కానీ ఆయన్ని తన కుటుంబంతో ఉండడానికి అనుమతించలేదు

  4. జూలై 29, 2021

    డార్యా, ప్యోటర్‌, సెర్గె మీద క్రిమినల్‌ కేసులు పెట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్లను ఉంచే చోట ప్యోటర్‌ను ఉంచారు

  5. జూలై 30, 2021

    క్రిమినల్‌ కేసులు ఉన్న సహోదర సహోదరులందర్నీ ఒకేసారి విచారణ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్యోటర్‌ను విడుదల చేసి హౌస్‌ అరెస్టులో ఉంచారు

  6. ఆగస్టు 11, 2021

    సెర్గెని అరెస్టు చేసి, కోర్టు విచారణ జరిగే వరకు పోలీసుల అదుపులో ఉంచారు. ఆయన్ని దాదాపు 800ల కిలోమీటర్ల (497 మైళ్ల) దూరంలో ఉన్న జైల్లో పెట్టారు. ఆ ప్రయాణం 16 గంటలు జరిగింది. అంతసేపు ఆయన చేతుల్ని పైకెత్తి ఒక రాడ్డుకు గొలుసులతో కట్టేశారు, కాళ్లని సీటుకు కట్టేశారు

  7. మార్చి 1, 2022

    సెర్గెని జైలు నుండి విడుదల చేసి హౌస్‌ అరెస్టులో ఉంచారు

  8. ఏప్రిల్‌ 4, 2022

    క్రిమినల్‌ కేసు విచారణ మొదలైంది

  9. జూలై 11, 2022

    ప్యోటర్‌, సెర్గె, తారాస్‌లను హౌస్‌ అరెస్టు నుండి విడుదల చేసి, ఊరు దాటి వెళ్లకూడదని ఆదేశించారు

ప్రొఫైల్స్‌

జైల్లో ఉన్నా, పోలీసుల అదుపులో ఉన్నా, లేదా హౌస్‌ అరెస్టులో ఉన్నా “పూర్తిగా కదల్లేని స్థితిలో” ఉన్నామని నమ్మకంగా ఉంటున్న వాళ్లకు అనిపించవచ్చు. కానీ తన పేరు విషయంలో హింసించబడుతున్న వాళ్లను యెహోవా ఎప్పటికీ విడిచిపెట్టడు.—2 కొరింథీయులు 4:8, 9.