కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Surasak Suwanmake/Moment via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

2023 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు—బైబిలు ఏం చెప్తుంది?

2023 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు—బైబిలు ఏం చెప్తుంది?

 ఈ సంవత్సరం ఉన్న విపరీతమైన వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల్ని, ఇతర విపత్తుల్ని ఎదుర్కొన్నారు. ఒకసారి ఈ రిపోర్టులను గమనించండి:

  •   “ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్ని నమోదు చేయడం 174 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. అప్పటినుండి చూసుకుంటే, ఈ సంవత్సరం జూన్‌లో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.”—నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్‌మోస్ఫీరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, యూ. ఎస్‌. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌, 2023 జూలై, 13.

  •   “ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ అలాగే పోలండ్‌ దేశాల్లో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. దాంతో సిసిలీ, సార్డినియా ద్వీపాల్లో ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు పెరుగుతుందని అంచనా. యూరోప్‌లో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యంత ఎక్కువ కావొచ్చు.”—యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, 2023 జూలై, 13.

  •   “ఈ భూమ్మీద వేడి పెరిగేకొద్దీ, మరింత తరచుగా, మరింత తీవ్రంగా వర్షాలు పడతాయి. దానివల్ల అత్యంత భారీ వరదలు వస్తాయి.”—స్టెఫాన్‌ ఊలన్‌బ్రూక్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హైడ్రాలజీ, వాటర్‌ అండ్‌ క్రైయోస్ఫీయర్‌ ఎట్‌ ద వోల్డ్‌ మీటిరియెలాజికల్‌ ఆర్గనైజేషన్‌, 2023 జూలై, 17.

 భూమ్మీద విపరీతంగా పెరిగిపోతున్న వేడిని చూసి మీకు కంగారుగా అనిపిస్తుందా? అయితే ఈ ప్రాముఖ్యమైన విషయం గురించి బైబిలు ఏం చెప్తుందో చూడండి.

వాతావరణంలో విపరీతమైన మార్పుల గురించి బైబిలు ముందే చెప్పిందా?

 చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని అలాగే వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పుల్ని చూస్తే, మన కాలంలో జరుగుతాయని బైబిలు ముందే చెప్పిన సంఘటనలకు అవి సరిగ్గా సరిపోతున్నాయి. ఉదాహరణకు, మనం “భయంకరమైన దృశ్యాలు” చూస్తామని యేసు ముందే చెప్పాడు. (లూకా 21:11) అధికంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని చూసిన చాలామంది, మనుషులు ఈ భూమిని నాశనం చేసేస్తారేమో అని భయపడుతున్నారు.

మనుషులు బ్రతకడం సాధ్యం కానంతగా ఈ భూమి పాడైపోతుందా?

 లేదు. దేవుడు ఈ భూమిని మనం ఎప్పటికీ ఉండడానికే చేశాడు; మనుషులు దానిని నాశనం చేయడానికి ఆయన అస్సలు అనుమతించడు. (కీర్తన 115:16; ప్రసంగి 1:4) నిజానికి, “భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం” చేస్తానని ఆయన మాటిచ్చాడు.—ప్రకటన 11:18.

 పర్యావరణం నాశనం అవ్వకుండా కాపాడే శక్తి దేవునికి ఉందని, ఆయన దానిని కాపాడతాడని బైబిలు చెప్తుంది.

  •   “[దేవుడు] తుఫానును నిమ్మళింపజేస్తాడు; సముద్ర తరంగాలు నిశ్శబ్దమౌతాయి.” (కీర్తన 107:29) ప్రకృతి శక్తుల్ని అదుపుచేసే సామర్థ్యం దేవునికి ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం అవుతున్న పర్యావరణ సమస్యల్ని పరిష్కరించే శక్తి ఆయనకు ఉంది.

  •   “నువ్వు భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, అది విస్తారంగా పండేలా చేస్తూ దాన్ని సుసంపన్నం చేస్తున్నావు.” (కీర్తన 65:9) దేవుడు ఈ భూమిని అందమైన తోటలా మారుస్తాడు.

 వాతావరణం మళ్లీ మంచిగా మారుతుందని బైబిలు చెప్తున్న మాట గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇంగ్లీష్‌లో ఉన్న “ఈ భూమిని ఎవరు కాపాడతారు?” అనే ఆర్టికల్‌ చూడండి.