కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు చేసిన త్యాగం నుండి ప్రయోజనం పొందండి

యేసు చేసిన త్యాగం నుండి ప్రయోజనం పొందండి

 సంవత్సరంలో ఒకసారి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు అలాగే వాళ్లు ఆహ్వానించిన లక్షలమంది యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కలుసుకుంటారు. అలా చేయమని యేసే చెప్పాడు. (లూకా 22:19) యేసు మనుషులందరి కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు; ఆయన చేసిన ప్రాణత్యాగం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఆ ఆచరణ మనకు సహాయం చేస్తుంది. ఆయన చేసిన త్యాగం వల్ల, ఇప్పుడు అలాగే భవిష్యత్తులో మనమెలా ప్రయోజనం పొందుతామో కూడా ఆ కార్యక్రమంలో తెలుసుకుంటాం.—యోహాను 3:16.

 మీరు ఈ సంవత్సరం యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి హాజరైనా, కాకపోయినా ఆయన అర్పించిన బలి నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు? మనం ముఖ్యంగా రెండు పనులు చేయాలని యేసు చెప్పాడు:

  1.  1. దేవుని గురించి, యేసు గురించి నేర్చుకోవాలి. యేసు తన పరలోక తండ్రికి ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు: “ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.”—యోహాను 17:3.

  2.  2. నేర్చుకున్న వాటిని పాటించాలి. తాను నేర్పించిన వాటిని మన జీవితంలో పాటించాలని యేసు పదేపదే చెప్పాడు. ఉదాహరణకు, ఆయన కొండమీద ఇచ్చిన ప్రసంగం గురించి చాలామందికి తెలుసు. ‘తన మాటలు విని, వాటిని పాటించే‘ వ్యక్తులందర్నీ మెచ్చుకుంటూ ఆయన ఆ ప్రసంగాన్ని ముగించాడు. (లూకా 6:46-48) అంతేకాదు, మరో సందర్భంలో ఆయన ఇలా అన్నాడు: “మీకు ఈ విషయాలు తెలుసు కాబట్టి, వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు.”—యోహాను 13:17.

 మీరు దేవుని గురించి, యేసు గురించి ఎక్కువ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? నేర్చుకున్న వాటిని ఎలా పాటించాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇవి మీకు ఉపయోగపడతాయి.

బైబిలు కోర్సు

 ఉచితంగా పొందే బైబిలు స్టడీ కోర్సు సహాయంతో ఇప్పటికే చాలామంది బైబిల్లో ఉన్న విషయాల్ని నేర్చుకుని, వాటిని వాళ్ల జీవితంలో పాటిస్తున్నారు.

  •  యెహోవాసాక్షులు ఇచ్చే బైబిలు స్టడీ కోర్సు” పేజీకి వెళ్లి ఈ కోర్సు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి.

  •   యెహోవాసాక్షులు ఇచ్చే బైబిలు స్టడీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి బైబిలు స్టడీకి స్వాగతం వీడియో చూడండి.

యెహోవాసాక్షుల కూటాలు

 యెహోవాసాక్షులు వారానికి రెండుసార్లు కలుసుకుని కూటాలు జరుపుకుంటారు. వాటిని జరుపుకునే ఆరాధనా స్థలాన్ని రాజ్యమందిరం అని పిలుస్తారు. ఆ కూటాల్లో మేం బైబిలు గురించి, అందులోని విషయాల్ని ఎలా పాటించాలనే దానిగురించి చర్చించుకుంటాం.

 ఈ కూటాలకు ఎవరైనా రావచ్చు; యెహోవాసాక్షులే వీటికి రావాలనే నియమమేమీ లేదు. మీ ప్రాంతంలోని పరిస్థితుల్ని బట్టి, మీరు నేరుగా రాజ్యమందిరానికి వెళ్లి వీటికి హాజరుకావచ్చు లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుకావచ్చు.

  •   ఈ కూటాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడానికి రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూడండి.

ఆన్‌లైన్‌ ఆర్టికల్స్‌, వీడియోలు

 ఈ వెబ్‌సైట్‌లో చాలా ఆర్టికల్స్‌, వీడియోలు ఉన్నాయి; అవి యేసు నేర్పించిన వాటి గురించి, ఆయన ప్రాణాన్ని బలి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి.

 ఉదాహరణకు, ఒక్క మనిషి చనిపోవడం వల్ల లక్షలమంది ప్రయోజనం పొందడం ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలనుకుంటే, “యేసు రక్షిస్తాడు—ఎలా?” అలాగే “యేసు ఎందుకు బాధ అనుభవించి చనిపోయాడు?” ఆర్టికల్స్‌ చదవండి లేదా యేసు ఎందుకు చనిపోయాడు? వీడియో చూడండి.