కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అప్రమత్తంగా ఉండండి!

ప్రపంచమంతటా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు—బైబిలు ఏం చెప్తుంది?

ప్రపంచమంతటా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు—బైబిలు ఏం చెప్తుంది?

 2022 జూలై నెలలో, ప్రపంచమంతటా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి:

  •   “నెలలో రెండోసారి చైనా అధికారుల హెచ్చరిక! సుమారు 70 నగరాల్లో ఎండలు భగ్గుమంటాయని ప్రకటన జారీ!”—జూలై 25, 2022, CNN వైర్‌ సర్వీస్‌.

  •   “యూరప్‌ ఖండంలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు! దాంతో, చాలా యూరప్‌ దేశాల్లో తగలబడిపోతున్న అడవులు!”—జూలై 17, 2022, ద గార్డియన్‌.

  •   “యుఎస్‌లోని తూర్పు తీర ప్రాంతాల్లో, అలాగే దక్షిణ, మధ్య-పశ్చిమ ప్రాంతాల్లో వేసవి ప్రతాపం మొదలైంది. దాంతో ఆదివారం చాలా నగరాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.”—జూలై 24, 2022, ద న్యూయార్క్‌ టైమ్స్‌.

 ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? మనుషులు జీవించడానికి పనికిరానంతగా ఈ భూమి పాడౌతుందా? బైబిలు ఏం చెప్తుంది?

ఉష్ణోగ్రతలు పెరగడం గురించి బైబిలు ముందే చెప్పిందా?

 అవును. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మనకాలం గురించి బైబిలు ముందే చెప్పిన విషయాలతో సరిపోతున్నాయి. ఉదాహరణకు, మన కాలంలో “భయంకరమైన దృశ్యాలు“ లేదా “భయంకరమైన సంఘటనలు” చూస్తామని యేసు ముందే చెప్పాడు. (లూకా 21:11; పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఉష్ణోగ్రతలు పెరగడం చూశాక, మనుషులు చేస్తున్న పనుల వల్ల జీవించడానికి వీల్లేనంతగా ఈ భూమి పాడైపోతుందని చాలామంది భయపడుతున్నారు.

భూమి జీవించడానికి వీల్లేనంతగా పాడైపోతుందా?

 లేదు. మనుషులు కలకాలం జీవించడానికి వీలుగా దేవుడు దీన్ని తయారుచేశాడు. (కీర్తన 115:16; ప్రసంగి 1:4) మనుషులు ఈ భూమిని నాశనం చేయడానికి దేవుడు అనుమతించడు. బదులుగా, ఎవరైతే భూమిని నాశనం చేస్తున్నారో, వాళ్లనే నాశనం చేస్తానని దేవుడు మాటిచ్చాడు.—ప్రకటన 11:18.

 భూమి గురించి దేవుడు ఇంకా ఏమని మాటిచ్చాడో చూడండి:

  •   “ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి, ఎడారి మైదానం సంతోషించి కుంకుమ పువ్వులా వికసిస్తుంది.” (యెషయా 35:1) దేవుడు ఈ భూమిని ఎడారిగా మారనివ్వడు, దానికి బదులు పాడైన ప్రాంతాలను మళ్లీ అందంగా మారుస్తాడు.

  •   “నువ్వు భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, అది విస్తారంగా పండేలా చేస్తూ దాన్ని సుసంపన్నం చేస్తున్నావు.” (కీర్తన 65:9) దేవుడు ఈ భూమిని ఎంతో అందమైన తోటలా మారుస్తాడు.

 వాతావరణ మార్పుల గురించి బైబిలు ముందే ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే, “వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?” ఆర్టికల్‌ చదవండి.

 వాతావరణం మళ్లీ మామూలు అవ్వడం గురించి బైబిలు ఏమని మాటిస్తోందో తెలుసుకోవాలంటే, “భూమిని ఎవరు కాపాడతారు?” (ఇంగ్లీషు) ఆర్టికల్‌ చూడండి.