కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

CreativeDesignArt/DigitalVision Vectors via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

జాతి భేదాలు లేని ప్రపంచం పగటి కలేనా?—బైబిలు ఏం చెప్తుంది?

జాతి భేదాలు లేని ప్రపంచం పగటి కలేనా?—బైబిలు ఏం చెప్తుంది?

 జాతి భేదాలు లేని ప్రపంచం చాలామందికి కలగానే మిగిలిపోతుంది.

  •   ప్రపంచంలో దాదాపు ప్రతీ మూల అటు స్కూళ్లలో, కాలేజీల్లో, నలుగురు మనుషులు కలిసివున్న ప్రతీ చోట, జాతి భేదం విషంలా సమాజమంతా పాకుతుంది. దానివల్ల ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనే భావం నరనరాల్లో ఉండిపోతుంది.—అన్టోనియో గుటేరిష్‌, UN సెక్రెటరీ-జనరల్‌.

 జాతి భేదాలు లేని ప్రపంచాన్ని అసలు చూడగలమా? బైబిలు ఏం చెప్తుంది?

జాతి భేదాల గురించి దేవుడు ఏం అనుకుంటున్నాడు

 వేర్వేరు జాతుల వాళ్లను దేవుడు ఎలా చూస్తున్నాడో బైబిలు చెప్తుంది.

  •   “భూమంతటి మీద జీవించడానికి ఆయన [దేవుడు] ఒకే ఒక్క మనిషి నుండి అన్నిదేశాల మనుషుల్ని చేశాడు.”—అపొస్తలుల కార్యాలు 17:26.

  •   ‘దేవునికి పక్షపాతం లేదు. ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.’—అపొస్తలుల కార్యాలు 10:34, 35.

 అందరి రక్తం ఒక్కటే అని, అందరం ఒకే కుటుంబం నుండి వచ్చాం అని బైబిలు చెప్తుంది. అలాగే జాతితో సంబంధం లేకుండా దేవుడు అందరినీ అంగీకరిస్తాడు.

జాతి భేదాలు లేని ప్రపంచం సాధ్యం

 అది పరలోకంలో ఉన్న దేవుని రాజ్యం అనే ప్రభుత్వం ద్వారా సాధ్యం. ఏ భేదం లేకుండా అందరినీ సమానంగా ఎలా చూడాలో ఆ ప్రభుత్వం ప్రజలకు నేర్పిస్తుంది. వాళ్ల నరనరాల్లో ఇంకిపోయిన జాతి భేదాన్ని కూడా ఎలా తీసేసుకోవాలో ఆ ప్రభుత్వం నేర్పిస్తుంది.

  •   “దేశ నివాసులు నీతి గురించి నేర్చుకుంటారు.”—యెషయా 26:9.

  •   “నిజమైన నీతి వల్ల శాంతి కలుగుతుంది, నిజమైన నీతికి ఫలం శాశ్వతమైన నెమ్మది, భద్రత.”—యెషయా 32:17.

 ఇప్పుడు కూడా ఎదుటివ్యక్తికి గౌరవ మర్యాదలు ఎలా ఇవ్వాలో లక్షలమంది బైబిలు నుండి నేర్చుకుంటున్నారు.