కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

74వ పాట

రండి, రాజ్య గీతం పాడదాం!

రండి, రాజ్య గీతం పాడదాం!

(కీర్తన 98:1)

  1. 1. రండి మనం జయగీతం పాడుదాం;

    మహాగొప్ప దేవుణ్ణి స్తుతిద్దాం.

    ఆ మాటలు నిరీక్షణనిస్తాయి;

    సంతోషంగా ఆలపిద్దాం దాన్ని:

    (పల్లవి)

    ‘సేవిద్దాము యెహోవాను.

    రాజయ్యాడు క్రీస్తుయేసు!

    ప్రకటిద్దాం ఈ వార్తను అంతటా;

    నేర్చుకోండి ఈ గీతాన్ని మీరూ.’

  2. 2. ఈ పాటతో ప్రకటిద్దాం రాజ్యాన్ని.

    పాలిస్తాడు క్రీస్తు ఈ భూమిని.

    యేసు చేసే పరిపాలన గూర్చి

    పాడుతోంది కొత్త జనాంగము:

    (పల్లవి)

    ‘సేవిద్దాము యెహోవాను.

    రాజయ్యాడు క్రీస్తుయేసు!

    ప్రకటిద్దాం ఈ వార్తను అంతటా;

    నేర్చుకోండి ఈ గీతాన్ని మీరూ.’

  3. 3. ఈ గీతాన్ని పాడొచ్చు దీనులంతా.

    ఎంతో స్పష్టం అదిచ్చే సందేశం.

    ఎంతోమంది నేర్చుకున్నారు దీన్ని,

    వాళ్లు కూడా ఆహ్వానిస్తున్నారు:

    (పల్లవి)

    ‘సేవిద్దాము యెహోవాను.

    రాజయ్యాడు క్రీస్తుయేసు!

    ప్రకటిద్దాం ఈ వార్తను అంతటా;

    నేర్చుకోండి ఈ గీతాన్ని మీరూ.’