కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

115వ పాట

దేవుడు ఓర్పు చూపిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉందాం

దేవుడు ఓర్పు చూపిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉందాం

(2 పేతురు 3:15)

  1. 1. యెహోవా, నీ శక్తి అనంతం,

    నీతి అంటే నీకు ప్రియం.

    ఏలుతుంది దుష్టత్వము,

    తెస్తుందెన్నో కష్టాలను.

    ఆలస్యము చేయవు నీవు,

    నీ ఓర్పుకు ఉంది ఓ హద్దు.

    (పల్లవి)

    కృతజ్ఞులం నీకు మేము,

    నిరీక్షణ ఇచ్చినందుకు.

  2. 2. వెయ్యి ఏళ్లు మాకు ఓ యుగం,

    నీకు అవి ఒకే దినం.

    రానైవుంది ఈ లోకాంతం;

    ఆలస్యము కాదేమాత్రం.

    పాపం అసహ్యమైనా నీకు,

    క్షమిస్తావు పశ్చాత్తప్తుల్ని.

    (పల్లవి)

    కృతజ్ఞులం నీకు మేము,

    నిరీక్షణ ఇచ్చినందుకు.