కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ఇష్టం ఏంటి?

దేవుని ఇష్టం ఏంటి?

మనం పరదైసు భూమ్మీద ఎప్పటికీ శాంతి సంతోషాలతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు!

‘అది ఎప్పటికైనా నిజమౌతుందా?’ అని మీకు అనిపించవచ్చు. దేవుని రాజ్యం దాన్ని నిజం చేస్తుందని బైబిలు చెప్తుంది. ఆ రాజ్యం గురించి, మనుషుల విషయంలో దేవుని ఉద్దేశం గురించి అందరూ తెలుసుకోవాలనేది ఆయన ఇష్టం.—కీర్తన 37:11, 29; యెషయా 9:7.

మనం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు.

ఒక మంచి తండ్రి తన పిల్లలు బాగుండాలని కోరుకున్నట్టే, మన పరలోక తండ్రి కూడా మనం నిరంతరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. (యెషయా 48:17, 18) “దేవుని ఇష్టాన్ని చేసే వ్యక్తి నిరంతరం జీవిస్తాడు” అని ఆయన మాటిచ్చాడు.—1 యోహాను 2:17.

మనం తన మార్గాల్లో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు.

మనం ‘ఆయన త్రోవల్లో నడిచేలా తన మార్గాల గురించి మనకు నేర్పించాలని’ సృష్టికర్త కోరుకుంటున్నాడు. (యెషయా 2:​2, 3) తన ఇష్టాన్ని ప్రపంచమంతటా తెలియజేయడానికి దేవుడు “తన పేరు కోసం” కొంతమంది ప్రజల్ని ఎంచుకున్నాడు.—అపొస్తలుల కార్యాలు 15:14.

మనం తనను ఐక్యంగా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు.

యెహోవా స్వచ్ఛారాధన వల్ల ప్రజలు విడిపోరు కానీ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటూ ఐక్యంగా ఉంటారు. (యోహాను 13:35) దేవున్ని ఐక్యంగా ఆరాధించడం గురించి ఎవరు అన్నిదేశాల్లో బోధిస్తున్నారు? ఈ బ్రోషుర్‌లో దానికి జవాబు తెలుసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.