కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

పిల్లికి మీసాలు ఎందుకు ఉన్నాయి?

పిల్లికి మీసాలు ఎందుకు ఉన్నాయి?

పిల్లులు ఎక్కువగా రాత్రి పూట తిరుగుతాయి. చీకట్లో చుట్టూ ఉన్న వస్తువుల్ని తెలుసుకోడానికి, ఆహారాన్ని పట్టుకోడానికి పిల్లులకు మీసాలు ఉపయోగపడతాయి.

ఎలానో చూద్దాం: పిల్లికి మీసాలు చర్మం లోపల ఉన్న కణజాలాల (tissues) వరకు ఉంటాయి. ఆ కణజాలాల్లో ఎన్నో నాడులు (nerves) చిన్నచిన్నగా విడిపోయి ఉంటాయి. ఆ నాడులు గాలిలో వచ్చే చిన్న కదలికలను కూడా తెలుసుకుంటాయి. వాటివల్ల పిల్లులు రాత్రి పూట సరిగ్గా కనబడకపోయినా దగ్గర్లో ఉన్న వాటిని తెలుసుకుంటాయి. చీకట్లో ఇవి చాలా ఉపయోగపడతాయి.

ఈ మీసాలను ఉపయోగించి పిల్లి వస్తువులు లేదా ఎలుకల కదలికలను కనిపెడుతుంది. అలా అవి ఎక్కడున్నాయో, ఎటు వెళ్తున్నాయో పిల్లి తెలుసుకుంటుంది. అంతేకాదు పిల్లులు ఏదైనా ఒక చిన్న సందు నుండి వెళ్లాలనుకున్నప్పుడు దాని వెడల్పు ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా ఈ మీసాలు సహాయం చేస్తాయి. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా అంటుంది: “పిల్లి మీసాలు ఏమేం చేస్తాయి అన్నది పూర్తిగా తెలీదు కానీ వాటిని కత్తిరిస్తే మాత్రం కొంతకాలం వరకు పిల్లులు వాటి శక్తిని కోల్పోతాయి.”

చుట్టూ ఉన్న వాటిని తెలుసుకోవడానికి సాయం చేసే పిల్లి మీసాల్లాంటి సెన్సార్లతో శాస్త్రవేత్తలు రోబోల్ని తయారుచేస్తున్నారు. ఈ సెన్సార్లను ఇ-విస్కర్స్‌ అంటారు. “రోబోలు తయారు చేయడంలో, సెన్సార్లతో పనిచేసే పరికరాల్లో, కృత్రిమ అవయవాల్లో ఇ-విస్కర్స్‌ ఎంతో ఉపయోగపడుతున్నాయి” అని బెర్క్‌లీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పనిచేస్తున్న సైంటిస్ట్‌ అలీ జావె అంటున్నాడు.

మీరేమంటారు? ఇంత బాగా పనిచేసే మీసాలు పిల్లికి ఎలా వచ్చాయి? సృష్టికర్త వల్ల కాదా? ◼ (g15-E 04)