కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి సలహా వెదకండి

మంచి సలహా వెదకండి

చర్య 1

మంచి సలహా వెదకండి

ఈ చర్య ఎందుకు తీసుకోవాలి? మొదటిసారిగా తల్లిదండ్రులు పసిబిడ్డను తమ చేతుల్లోకి తీసుకున్నప్పుడు వారిలో విభిన్న భావాలు కలగవచ్చు. “నా సంతోషానికి, ఆశ్చర్యానికి అవధుల్లేవు. అంతేకాదు అదొక పెద్ద బాధ్యతనీ, దానికి నేనిప్పుడు సిద్ధంగాలేననీ అనిపించింది” అని బ్రిటన్‌లో నివసిస్తున్న ఒక తండ్రి చెబుతున్నాడు. అర్జెంటీనాలో ఉంటున్న మోనికా అనే ఓ తల్లి ఇలా చెబుతోంది: “నా చిట్టితల్లి అవసరాలను నేను తీర్చగలనో లేదో అని భయపడ్డాను. ‘మా అమ్మాయిని బాధ్యతగల వనితగా తీర్చిదిద్దగలనా?’ అని ఆలోచించాను.”

అలాంటి తల్లిదండ్రులు అనుభవించే సంతోషాలను, పడే ఆందోళనలను మీరు అర్థంచేసుకోగలరా? నిశ్చయంగా, పిల్లలను పెంచడం పెద్ద సవాలే అయినా సంతృప్తికరమైనది, విసుగు కలిగించేదే అయినా ప్రయోజనకరమైనది, ఈ బాధ్యతలను ఏ వ్యక్తైనా నిర్వర్తించవచ్చు. ఒక తండ్రి చెప్పినట్టు, “పిల్లవాణ్ణి తీర్చిదిద్దే అవకాశం మీకొక్కసారే లభిస్తుంది.” తమ పిల్లల ఆరోగ్యంపై, సంతోషంపై తల్లిదండ్రులు కలిగివుండగల అపారమైన ప్రభావాన్నిబట్టి, మంచి తల్లిదండ్రులుగా ఎలా ఉండాలనే విషయంలో నమ్మదగిన సలహా ఎంతో అవసరమని మీకనిపించవచ్చు.

అది ఎందుకు కష్టం? పిల్లలను పెంచే విషయంలో ప్రతీఒక్కరి దగ్గరా సలహా ఉన్నట్లు అనిపిస్తోంది. కొత్తగా తల్లిదండ్రులైన జంటలు ఒకప్పుడు మార్గనిర్దేశం కోసం తమ తల్లిదండ్రుల మాదిరిపై లేదా తమ మత నమ్మకాలపై ఆధారపడేవారు. అయితే చాలా దేశాల్లో, కుటుంబ ఐక్యత సన్నగిల్లిపోగా, మతం దాని ప్రభావాన్ని కోల్పోయింది. అందుకే, చాలామంది తల్లిదండ్రులు సలహా కోసం, పిల్లలను పెంచడానికి సంబంధించి సలహా ఇవ్వగల నిపుణుల దగ్గరకు వెళ్తున్నారు. ఈ నిపుణులిచ్చే సలహాలు కొంతవరకు సరైన సూత్రాలపై ఆధాపడివుంటాయి. అయితే, ఇతర సందర్భాల్లో వారిచ్చే సూచనలు పరస్పర విరుద్ధంగా ఉండడమేగాక, కొంతకాలానికి అవి పనికిరావన్నట్లు పరిగణించబడవచ్చు.

పరిష్కారం: పిల్లల్ని ఎలా పెంచాలో బాగా తెలిసిన వ్యక్తిని అంటే మానవ జీవానికి సృష్టికర్తైన యెహోవా దేవుడిచ్చే సలహాను వెదకండి. (అపొస్తలుల కార్యములు 17:26-28) మంచి తల్లిదండ్రులయ్యేందుకు మీకు సహాయపడే సూటైన నిర్దేశాలు, ఆచరణీయమైన ఉదాహరణలు ఆయన వాక్యమైన బైబిలులో ఉన్నాయి. “నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.—కీర్తన 32:8.

సంతోషభరితమైన పిల్లలను పెంచే విషయంలో సహాయపడే ఎలాంటి సలహాను దేవుడు తల్లిదండ్రులకిస్తున్నాడు? (g 8/07)

[3వ పేజీలోని బ్లర్బ్‌]

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.”—సామెతలు 3:5