కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇంటర్వ్యూ | యాన్‌-డెర్‌ సూ

ఒక ఎంబ్రియాలజిస్ట్‌ తన విశ్వాసాన్ని వివరిస్తున్నాడు

ఒక ఎంబ్రియాలజిస్ట్‌ తన విశ్వాసాన్ని వివరిస్తున్నాడు

తైవాన్‌ దేశంలో ప్రొఫెసర్‌ యాన్‌-డెర్‌ సూ నేషనల్‌ పింగ్‌టంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పిండానికి సంబంధించిన పరిశోధన విభాగానికి డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన మొదట్లో పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాడు కాని రీసర్చ్‌ సైన్‌టిస్ట్‌ అయ్యాక నమ్మడం మానేశాడు. అందుకు కారణాలు తేజరిల్లు!కు వివరించారు.

మీ గురించి కొన్ని విషయాలు చెప్పండి.

నేను 1966⁠లో పుట్టాను. తైవాన్‌లో పెరిగాను. నా తల్లిదండ్రులు టావోయిజమ్‌, బౌద్ధ మతం రెండిటినీ పాటించేవాళ్లు. మా పూర్వికులను ఆరాధించేవాళ్లం, విగ్రహాలకు ప్రార్థన చేసేవాళ్లం. కానీ, ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు.

మీరు బయాలజి ఎందుకు చదివారు?

చిన్నప్పటి నుండే పెంపుడు జంతువులు అంటే నాకు ఇష్టం. జంతువులకు, మనుషులకు ఉండే బాధల్ని ఎలా తగ్గించాలో నేర్చుకోవాలని అనుకున్నాను. కొంత కాలం, పశువైద్యం చదివాను తర్వాత ఎంబ్రియాలజి (పిండోత్పత్తి శాస్త్రం) చదివాను. ఎంబ్రియాలజి చదివితే జీవం ఎలా మొదలైందో తెలుసుకోవచ్చని అనుకున్నాను.

మీరు మొదట్లో పరిణామ సిద్ధాంతం నమ్మారు కదా. ఎందుకో చెప్తారా?

యూనివర్సిటీలో ప్రొఫెసర్లు పరిణామ సిద్ధాంతం గురించి నేర్పించారు, అందుకు రుజువులు ఉన్నాయని చెప్పారు. నేను వాళ్లను నమ్మాను.

మీరు బైబిలు చదవడం ఎందుకు మొదలుపెట్టారు?

అందుకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, ప్రజలు ఎంతోమంది దేవుళ్లను ఆరాధిస్తారు. అయితే ఒక దేవుడు అందరికంటే గొప్పవాడై ఉంటాడని నేను అనుకునేవాడిని. కానీ, అది ఏ దేవుడు? రెండవది, బైబిలును చాలామంది గౌరవిస్తారని నాకు తెలుసు కాబట్టి బైబిల్ని నేర్పించే క్లాసులకు వెళ్లాను.

1992⁠లో బెల్జియంలో కాథలిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లూవెన్‌లో చదువుకోవడానికి చేరాను. అక్కడ క్యాథలిక్‌ చర్చ్‌కు వెళ్లాను, బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అక్కడి ఫాదర్‌ను అడిగాను. కానీ ఆయన ఒప్పుకోలేదు.

మరి, మీ ప్రశ్నలకు జవాబులు ఎలా దొరికాయి?

రెండు సంవత్సరాల తర్వాత నేను బెల్జియంలో రీసర్చ్‌ చేస్తుండగా, పోలండ్‌ దేశానికి చెందిన రూత్‌ అనే ఆమెను కలిశాను. ఆమె ఒక యెహోవాసాక్షి. దేవుని గురించి తెలుసుకోవాలనుకునే యూనివర్సిటీ విద్యార్థులకు సహాయం చేయడానికి ఆమె చైనీస్‌ భాష నేర్చుకుంది. అలాంటి సహాయం కోసమే నేనూ ప్రార్థించాను కాబట్టి ఆమెను కలుసుకున్నప్పుడు చాలా సంతోషించాను.

బైబిలు సైన్స్‌ పుస్తకం కాకపోయినా బైబిలు చెప్తున్న విషయాలు, సైన్స్‌ చెప్తున్న విషయాలు ఒకేలా ఉన్నాయని రూత్‌ నాకు చూపించింది. ఉదాహరణకు, బైబిలు రాసినవాళ్లలో ఒకరైన దావీదు దేవునికి చేసిన ప్రార్థనలో ఇలా అన్నాడు: “నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.” (కీర్తన 139:16) దావీదు ఈ మాటలను కవితలా రాసినా అందులో నిజం ఉంది. శరీరంలో అవయవాలు పూర్తిగా తయారవ్వక ముందే అవి తయారవ్వడానికి అవసరమైన నియమాలు శరీరంలో ఉన్నాయి. బైబిల్లో ఉన్న వివరాలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో చూసినప్పుడు అది దేవుని వాక్యమని నాకు నమ్మకం కలిగింది. నిజమైన దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అనే విషయం కూడా నాకు అర్థమైంది. 1

దేవుడే జీవాన్ని సృష్టించాడని మీరు నమ్మడానికి కారణం?

నిజం కనుక్కోవడానికే సైన్‌టిస్ట్‌లు రీసర్చ్‌ చేస్తారు, కానీ ఎవరో ఊహించి పెట్టిన విషయాలకు రుజువులు వెదకడానికి కాదు. పిండం ఎలా తయారౌతుందనే విషయం గురించి నేను పరిశోధిస్తున్నప్పుడు నా అభిప్రాయం మారింది. జీవాన్ని ఎవరో సృష్టించారు అని నాకు అనిపించింది. ఉదాహరణకు, ఫ్యాక్టరీలు డిజైన్‌ చేసేటప్పుడు ఇంజనీర్లు యంత్రాలను ఎక్కడ పెట్టాలో, ఎలా పెట్టాలో ఆలోచించి, సరిగ్గా అలానే పెడతారు. అప్పుడే ఫ్యాక్టరీ బాగా పని చేస్తుంది. పిండం తయారౌతున్నప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది, కానీ అది అంతకంటే పెద్ద ప్రక్రియ.

ఈ ప్రక్రియ అంతా ఒక చిన్న కణంతో మొదలౌతుంది కదా?

అవును. ఆ ఒక్క సూక్ష్మ కణం విడిపోవడంతో కణ విభజన మొదలౌతుంది. కొంతకాలం, కణాల సంఖ్య ప్రతీ 12-24 గంటలకు రెండింతలు అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ మొదట్లోనే మూల జీవకణాలు తయారౌతాయి.  2మూల జీవకణాల నుండే ఒక శిశువుకు అవసరమైన రక్త కణాలు, ఎముకల కణాలు, నరాల కణాలు లాంటి దాదాపు 200 వేర్వేరు రకాల కణాలు ఎన్నో తయారు అవుతాయి.

పిండం తయారవ్వడం గురించి నేను చేసిన రీసర్చ్‌ వల్ల జీవానికి సృష్టికర్త ఉన్నాడు అని నాకు నమ్మకం కలిగింది

సరైన క్రమంలో, సరైన చోట, సరైన కణాలు ఉత్పత్తి అవ్వాలి. అప్పుడు ఆ కణాలు మొదట కణజాలాలుగా ఏర్పడతాయి, ఆ కణజాలాలు అవయవాలుగా, కాళ్లు-చేతులుగా తయారౌతాయి. ఇంత అద్భుతమైన ప్రక్రియకు అవసరమైన నియమాలు ఏ ఇంజనీరు రాయలేడు. కానీ, పిండం తయారవ్వడానికి అవసరమైన నియమాలన్నీ మన DNAలో ముందుగానే స్పష్టంగా ఉంటాయి. ఇంత అద్భుతంగా పనిచేసే వాటి గురించి ఆలోచించినప్పుడు జీవానికి మూలం దేవుడే అని నాకు నమ్మకం కలిగింది.

మీరు ఒక యెహోవాసాక్షి ఎందుకు అయ్యారు?

ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేమ వల్ల. యేసు ఇలా అన్నాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.” (యోహాను 13:35) అలాంటి ప్రేమలో పక్షపాతం ఉండదు. దేశం, జాతి, రంగు బట్టి ఆ ప్రేమ ఉండదు. యెహోవాసాక్షులను కలిసినప్పటి నుండి నేను అలాంటి ప్రేమను చూశాను, ఆనందించాను.

^ 2. క్రైస్తవ మనస్సాక్షి వల్ల, ప్రొఫెసర్‌ యాన్‌-డెర్‌ సూ మానవ పిండంలో ఉన్న మూల జీవకణాలతో పని చేయడు.