కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచమంతా గందరగోళం

4 | ఆశ వదులుకోకండి

4 | ఆశ వదులుకోకండి

ఎందుకో తెలుసా?

పరిస్థితులేంటి ఇంత గందరగోళంగా ఉన్నాయనే ఆందోళన ఆరోగ్యాన్ని పాడుచేయడంతో పాటు, మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. అలాంటి ఒత్తిడివల్ల, ఎప్పటికైనా మంచిరోజులు వస్తాయనే ఆశ చాలామందిలో చచ్చిపోతోంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు?

  • కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచించడమే మానేస్తారు.

  • ఇంకొంతమంది మందుకు, డ్రగ్స్‌కు అలవాటుపడతారు.

  • కొందరు బ్రతకడంకన్నా, చావడం మేలనే ముగింపుకు వచ్చేస్తారు.

మీకు తెలుసా?

  • మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని రోజులే ఉండొచ్చు. ఆ తర్వాత, ఊహించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారచ్చు.

  • ఒకవేళ మీ సమస్య అలాగే ఉన్నా, దాన్ని తట్టుకుని ముందుకు వెళ్లడానికి మీకు ఇంకా చాలా మార్గాలు ఉంటాయి.

  • మనుషుల సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం రాబోతోందని బైబిలు మాటిస్తోంది.

ఇప్పుడు ఏం చేయాలి?

బైబిలు ఇలా చెప్తుంది: “రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి, ఏ రోజు సమస్యలు ఆ రోజుకు చాలు.”—మత్తయి 6:34.

ఏ రోజు గురించి ఆరోజు ఆలోచించండి. రేపు ఏం జరుగుతుందనే ఆందోళనతో ఈరోజు చేయాల్సిన పనుల్ని చేయలేకపోవడం మంచిదికాదు.

ఖచ్చితంగా జరుగుతాయో లేదో తెలియని విషయాల గురించి అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు, భవిష్యత్తు మీద ఆశ ఆవిరైపోతుందే తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు.

బైబిలు మనలో ఆశ నింపుతుంది

పూర్వకాలంలోని ఒక రచయిత దేవునికి ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు: “నీ వాక్యం నా పాదానికి దీపం, నా త్రోవకు వెలుగు.” (కీర్తన 119:105) దేవుని వాక్యమైన బైబిలు ఒక దీపంలా, వెలుగులా ఎలా ఉండగలదని అనుకుంటున్నారా?

చిమ్మచీకట్లో అడుగు ఎక్కడ వేయాలో తెలియనప్పుడు, దీపం మనకు దారి చూపిస్తుంది. అదేవిధంగా, నిర్ణయం తీసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు, సరైన నిర్ణయం తీసుకోవడానికి బైబిల్లో ఉన్న తెలివైన సలహాలు సహాయం చేస్తాయి.

వెలుగు, మన ముందున్న దారి ఎలా ఉందో చూపిస్తుంది. బైబిలు కూడా, మన ముందు వేచివున్న అందమైన భవిష్యత్తును మనకు చూపిస్తుంది.