కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు కొన్ని సినిమాలను, పుస్తకాలను, పాటలను నిషేధిస్తారా?

యెహోవాసాక్షులు కొన్ని సినిమాలను, పుస్తకాలను, పాటలను నిషేధిస్తారా?

 లేదు. తమ సభ్యులు వేటివేటికి దూరంగా ఉండాలో చెప్పేందుకు మా సంస్థ ఆయా సినిమాలను, పుస్తకాలను, పాటలను సమీక్షించదు. ఎందుకని?

  తప్పొప్పులను వివేచించగలిగేలా “జ్ఞానేంద్రియాలను” సాధకం చేసుకోమని బైబిలు ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తోంది.—హెబ్రీయులు 5:14.

  ఒక క్రైస్తవుడు వినోదాన్ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు లేఖనాల్లో ఉన్నాయి. a జీవితంలోని మిగతా రంగాల్లోలాగే వినోదం విషయంలో కూడా “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు” ఉండాలన్నదే మా ధ్యేయం.—ఎఫెసీయులు 5:10.

  కుటుంబంలో భర్తకు భార్యా పిల్లల మీద కొంత అధికారం ఉందని బైబిలు బోధిస్తుంది కాబట్టి, భర్తలు ఫలానా వినోదం విషయంలో తమ ఇంటివారికి ఆంక్షలు విధించాలని నిర్ణయించుకోవచ్చు. (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 6:1-4) అయితే కుటుంబ పరిధిలో కాకుండా ఫలానా సినిమాలు, పాటలు, సంగీతం సంఘంలోని సభ్యులకు తగినవికావంటూ ఆంక్షలు విధించే అధికారం ఎవ్వరికీ లేదు.—గలతీయులు 6:5.

a ఉదాహరణకు, మంత్రతంత్రాలను, లైంగిక అనైతికతను, హింసను ప్రేరేపించే వాటన్నిటినీ బైబిలు ఖండిస్తుంది.—ద్వితీయోపదేశకాండము 18:10-13; ఎఫెసీయులు 5:3; కొలొస్సయులు 3:8.