కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు మిషనరీ సేవ చేస్తారా?

యెహోవాసాక్షులు మిషనరీ సేవ చేస్తారా?

 చేస్తాం. మేము ఎక్కడ నివసిస్తున్నా, యెహోవాసాక్షులమైన మేమంతా మేము కలిసే ప్రజలతో మా విశ్వాసం గురించి మాట్లాడుతూ మిషనరీ వైఖరిని లేదా స్ఫూర్తిని చూపించడానికి కృషిచేస్తాం.—మత్తయి 28:19, 20.

 అంతేకాదు, కొందరు సాక్షులు తమ దేశంలో బైబిలు సువార్తను ఇంకా వినని ప్రజలు ఎక్కువమంది ఉన్న ప్రాంతాలను సందర్శిస్తుంటారు లేదా కొంతకాలం పాటు అక్కడే ఉండిపోతారు. ఇంకొందరు సాక్షులు, ఎక్కువ పరిచర్య చేయడానికి విదేశాలకు తరలివెళ్తుంటారు. ‘మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు’ అని యేసు చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చడంలో భాగం వహిస్తున్నందుకు వాళ్లు సంతోషిస్తారు.—అపొస్తలుల కార్యములు 1:8.

 మా మిషనరీల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి, 1943లో మేము ఒక పాఠశాలను ప్రారంభించాం. దాని పేరు, వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌. ప్రారంభించిన దగ్గర నుండి ఆ పాఠశాలలో 8,000 కన్నా ఎక్కువమంది సాక్షులు శిక్షణ పొందారు.