కంటెంట్‌కు వెళ్లు

జీతానికి పనిచేసే మతనాయకులు యెహోవాసాక్షుల్లో ఉన్నారా?

జీతానికి పనిచేసే మతనాయకులు యెహోవాసాక్షుల్లో ఉన్నారా?

 మొదటి శతాబ్దంలోని క్రైస్తవ మతాన్ని ఆదర్శంగా తీసుకున్న యెహోవాసాక్షుల్లో మతనాయకులు-సామాన్యులు అనే భేదం లేదు. యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న సభ్యులందరూ పరిచారకులే. వాళ్లు ప్రకటనా పనిలో, బోధనా పనిలో పాల్గొంటారు. యెహోవాసాక్షుల సంఘం దాదాపు 100 మంది సభ్యులతో ఏర్పడుతుంది. ప్రతీ సంఘంలో ఆధ్యాత్మికంగా పరిణతిగల పురుషులు ‘పెద్దలుగా’ సేవచేస్తారు. (తీతు 1:5) ఆ సేవను వాళ్లు జీతం తీసుకోకుండా చేస్తారు.