కంటెంట్‌కు వెళ్లు

తమను మాత్రమే దేవుడు రక్షిస్తాడని యెహోవాసాక్షులు అనుకుంటున్నారా?

తమను మాత్రమే దేవుడు రక్షిస్తాడని యెహోవాసాక్షులు అనుకుంటున్నారా?

 లేదు. ఎన్నో శతాబ్దాల క్రితం జీవించిన యెహోవాసాక్షులు కాని కోట్లాదిమందికి రక్షణ పొందే అవకాశం ఉంది. దేవుడు మాటిచ్చిన కొత్త లోకంలో ‘నీతిమంతులకు, అనీతిమంతులకు పునరుత్థానం కలుగబోతుందని’ బైబిలు వివరిస్తోంది. (అపొస్తలుల కార్యములు 24:14, 15) అంతేకాదు, నేడు జీవిస్తున్న చాలామంది భవిష్యత్తులో దేవుణ్ణి ఆరాధించే అవకాశం ఉంది, వాళ్లను కూడా దేవుడు రక్షిస్తాడు. ఏదేమైనా దేవుడు ఎవర్ని రక్షిస్తాడో, ఎవర్ని రక్షించడో చెప్పడం మా పని కాదు. దేవుడు తీర్పు తీర్చే అధికారాన్ని యేసుకు మాత్రమే ఇచ్చాడు.—యోహాను 5:22, 23, 27.