కంటెంట్‌కు వెళ్లు

ఫిలిప్పీన్స్‌లోని విద్యావేత్తలు JW.ORG ప్రయోజనాలను తెలుసుకున్నారు

ఫిలిప్పీన్స్‌లోని విద్యావేత్తలు JW.ORG ప్రయోజనాలను తెలుసుకున్నారు

2016లో ఫిలిప్పీన్స్‌లో జాంబ్వాంగా డెల్‌ నోర్టె ప్రాంతంలోని విద్యావేత్తలకు jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోల, ఆర్టికల్‌ల బోధనా విలువ ప్రదర్శించే గొప్ప అవకాశం యెహోవాసాక్షులకు దొరికింది. సాక్షులు ముందుగా రాజధానియైన డీపోలోగ్‌ పట్టణంలోని ఆ ప్రాంత ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ను కలిశారు. దాని నిర్వాహకులు jw.org వెబ్‌సైట్‌ చూసి ఎంత ముగ్ధులయ్యారంటే, జాంబ్వాంగా డెల్‌ నోర్టెలో ఆయా మున్సిపాలిటీల్లోని టీచర్ల కోసం నిర్వహించబోతున్న మూడు సెమినార్లలో 30 నిమిషాల ప్రజంటేషన్‌ ఇవ్వమని కోరారు.

ఆ ప్రజంటేషన్‌లను ఎలా ఇచ్చారు?

ప్రతీ సెమినార్‌కి హాజరైన దాదాపు 300 మంది టీచర్లకు సాక్షులు ఎంపిక చేసిన కొన్ని వీడియోలను, వెబ్‌ ఆర్టికల్స్‌ను చూపించారు. హాజరైనవాళ్లు ముఖ్యంగా “అప్పులతో ఎలా వ్యవహరించాలి?” అనే అంశాన్ని ఎంతో ఇష్టపడ్డారు. చాలామంది టీచర్లు ఆ ప్రజంటేషన్‌లు కేవలం విద్యార్థులకే కాదు తమకు కూడా ఉపయోగపడతాయని భావించారు. వాళ్లందరూ జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే కరపత్రాన్ని తీసుకున్నారు. jw.orgలో ఉన్న విస్తారమైన, ఆసక్తికరమైన, ఉపయోగపడే సమాచారం గురించి అది సంక్షిప్తంగా చెప్తుంది. కొంతమంది టీచర్లు ఆ వెబ్‌సైట్‌ నుండి వీడియోలను డౌన్‌లోడ్‌ కూడా చేసుకున్నారు.

ఆ మూడు ప్రజంటేషన్‌లు విజయవంతం అవ్వడంతో ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సుమారు 600 మంది గైడెన్స్‌ కౌన్సిలర్ల కోసం, విద్యావేత్తల కోసం అలాంటి ఇంకొన్ని ప్రజంటేషన్‌లను ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా చాలామంది ఈ ఏర్పాటును హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు.

“వెబ్‌సైట్‌ ఎంతో సహాయం చేస్తుంది”

వాటికి హాజరైనవాళ్లలో కొంతమంది ప్రజంటేషన్‌లు, వెబ్‌సైట్‌ తమకు ఎలా సహాయం చేశాయో తర్వాత వివరించారు. ఒక టీచర్‌ ఇలా చెప్పింది: “నాకు థ్యాంక్స్‌ చెప్పాలని ఉంది, మా విద్యార్థులకు బోధించడానికి ఆ వెబ్‌సైట్‌ చాలా ఉపయోగపడుతుంది.” ఇంకో టీచర్‌ ఇలా ఒప్పుకుంది: “నేను ఎన్నో పాఠాలను నేర్చుకోవాలి, ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకోవడం గురించి. యౌవనస్థులకే కాదు వయసు పైబడుతున్న వాళ్లకు కూడా వెబ్‌సైట్‌ ఎంతో సహాయం చేస్తుంది.”

jw.org ప్రజంటేషన్‌లకు హాజరైన 350 కన్నా ఎక్కువమంది విద్యావేత్తలు మరింత సమాచారం కోసం అడిగారు. సాక్షులు వాళ్లకు ఇంకొన్ని సాహిత్యాల్ని ఇచ్చారు, ఆసక్తి చూపించినవాళ్లతో బైబిల్లోని సలహాల్ని పంచుకున్నారు.

జాంబ్వాంగా డెల్‌ నోర్టెలో జరిగిన jw.org ప్రజంటేషన్‌లకు 1,000 కన్నా ఎక్కువమంది విద్యావేత్తలు హాజరై, jw.org వెబ్‌సైట్‌ బోధించడానికి ఎంతో ఉపయోగపడే ఒక శక్తివంతమైన పరికరం అని అర్థం చేసుకున్నందుకు యెహోవాసాక్షులు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ అమూల్యమైన విద్యా పరికరం, ఎంతో చక్కని నీతి సూత్రాల్ని, నైతిక విలువల్ని, ఆధ్యాత్మిక నిర్దేశాన్ని అందజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలకు సహాయం చేయగలదు. a

a విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని అందించే బాధ్యతే కాదు వాళ్లకు “చక్కని నీతి సూత్రాల్ని, ఆధ్యాత్మిక విలువల్ని నేర్పించి మంచి నైతిక ప్రవర్తన, వ్యక్తిగత క్రమశిక్షణ గల వ్యక్తులుగా తీర్చిదిద్దే” బాధ్యత కూడా ఫిలిప్పీన్స్‌లోని విద్యా సంస్థలకు అప్పగించబడింది.​—ద 1987 కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ద రిపబ్లిక్‌ ఆఫ్‌ ద ఫిలిప్పీన్స్‌, ఆర్టికల్‌ XIV, సెక్షన్‌ 3.2.