కంటెంట్‌కు వెళ్లు

సాతాను నిజంగా ఉన్నాడా?

సాతాను నిజంగా ఉన్నాడా?

బైబిలు ఇచ్చే జవాబు

 అవును, సాతాను నిజంగా ఉన్నాడు. చెడ్డగా మారి దేవుణ్ణి వ్యతిరేకించిన ఆ అదృశ్యప్రాణియే ఇప్పుడు “ఈ లోకాధికారి.” (యోహాను 14:30; ఎఫెసీయులు 6:11, 12) సాతానుకున్న ఈ పేర్లు, వాటి అర్థాలను బట్టి అతను ఎలాంటివాడో బైబిలు మనకు చెప్తుంది:

సాతాను అంటే చెడ్డ లక్షణం కాదు

 సాతాను మనలో ఉండే ఒక చెడు లక్షణమేనని కొంతమంది అనుకుంటారు. అయితే, దేవునికి సాతానికి మధ్య జరిగిన సంభాషణ గురించి బైబిల్లో ఉంది. దేవుడు పరిపూర్ణుడు కాబట్టి ఆయన తనలోని చెడుతో మాట్లాడుకునే అవకాశం లేదు. (ద్వితీయోపదేశకాండము 32:4; యోబు 2:1-6) అదేవిధంగా అస్సలు పాపమే చేయని యేసును కూడా సాతాను శోధించాడు. (మత్తయి 4:8-10; 1 యోహాను 3:5) కాబట్టి సాతాను అంటే మనలోని చెడును సూచించే ఒక లక్షణం కాదుగానీ అతనొక నిజమైన వ్యక్తని బైబిలు చెప్తుంది.

 సాతాను ఒక నిజమైన వ్యక్తని చాలామంది ప్రజలు నమ్మట్లేదు. దీనికి మనం ఆశ్చర్యపోవాలా? ఎంతమాత్రం లేదు. ఎందుకంటే తాను అనుకున్నవి సాధించడానికి సాతాను ప్రజల్ని మోసం చేస్తాడని బైబిలు చెప్తుంది. (2 థెస్సలొనీకయులు 2:9, 10) సాతాను ఉపయోగించే కుతంత్రాల్లో ముఖ్యమైనది ఏంటంటే, తాను ఉన్నానని గ్రహించకుండా ప్రజలను మోసం చేయడమే.—2 కొరింథీయులు 4:4.

సాతాను గురించిన మరిన్ని తప్పుడు అభిప్రాయాలు

  అపోహ: సాతానుకున్న మరో పేరు లూసిఫర్‌.

 నిజం: కొన్ని బైబిళ్లలో “లూసిఫర్‌” అని అనువదించిన హీబ్రూ పదానికి “వేకువచుక్క” అని అర్థం. (యెషయా 14:12) ఈ పదాన్ని ఉపయోగించిన సందర్భాన్ని గమనిస్తే, గర్వం చూపించినందుకు దేవుడు నాశనం చేసిన రాజవంశాన్ని లేదా బబులోనుకు సంబంధించిన రాజవంశీయుల్ని అక్కడ అది సూచిస్తుంది. (యెషయా 14:3-4, 13-20) బబులోను వంశావళిని నాశనం చేసిన తర్వాత దాని స్థితిని అపహాస్యం చేయడానికి “వేకువచుక్క” అనే పదాన్ని ఉపయోగించారు.

  అపోహ: దేవుడు మనుషులకు “తీర్పు తీర్చడానికి” సాతానును ఉపయోగించుకుంటాడు.

 నిజం: సాతాను దేవుని శత్రువేగానీ ఆయన కోసం పనిచేసే వ్యక్తి కాదు. అపవాదియైన సాతాను, దేవుణ్ణి సేవించే ప్రజలను వ్యతిరేకిస్తూ వాళ్ల మీద నిందలు వేస్తూ ఉంటాడు.—1 పేతురు 5:8; ప్రకటన 12:10.