కంటెంట్‌కు వెళ్లు

మనం విగ్రహాలను ఆరాధించాలా?

మనం విగ్రహాలను ఆరాధించాలా?

బైబిలు ఇచ్చే జవాబు

 మనం విగ్రహాలను ఆరాధించకూడదు. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన నియమాల గురించి వివరిస్తూ, న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్తుంది, “బైబిల్లో ఉన్న వేర్వేరు వృత్తాంతాల్ని పరిశీలిస్తే, సత్యారాధనలో విగ్రహాలకు చోటు లేదని అర్థమౌతుంది.” ఈ బైబిలు వచనాలను పరిశీలించండి:

  •   “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను.” (నిర్గమకాండము 20:4, 5) ఆయన “రోషముగల దేవుడు,” అంటే తనను మాత్రమే ఆరాధించాలని కోరుకునే దేవుడు. కాబట్టి మనం విగ్రహాలను, చిత్రపటాలను, బొమ్మలను, ప్రతిమలను, మలిచిన లేదా పోతపోసిన విగ్రహాలను, లేదా చిహ్నాలను ఆరాధించినా లేదా స్తుతించినా ఆయన సంతోషించడు.

  •   “నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.” (యెషయా 42:8) విగ్రహాల ద్వారా తనను ఆరాధిస్తే దేవునికి ఇష్టం ఉండదు. ఒక సందర్భంలో, కొంతమంది ఇశ్రాయేలీయులు ఒక దూడను చేసికొని, దాని ద్వారా తనను ఆరాధించడానికి ప్రయత్నించినప్పుడు, వాళ్లు “భయంకర పాపం” చేశారని దేవుడు అన్నాడు.—నిర్గమకాండము 32:7-9, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

  •   “దేవుడు బంగారంతో కాని లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటి వాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడుకాడు.” (అపొస్తలుల కార్యములు 17:29, రిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.) అన్యమత ఆరాధనలో, “మానవుడు తన కల్పనతో, కవతో” తయారు చేసిన విగ్రహాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ క్రైస్తవులు మాత్రం, బైబిలు చెప్తున్నట్లు “వెలి చూపువలన కాక విశ్వాసమువలన” నడుచుకోవాలి.—2 కొరింథీయులు 5:6.

  •   “విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.” (1 యోహాను 5:21) ఆరాధనలో విగ్రహాలను, ప్రతిమలను ఉపయోగిస్తే దేవుడు ఇష్టపడడనే విషయాన్ని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ విషయం, ఇశ్రాయేలు జనాంగానికి, క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని బట్టి అర్థమౌతోంది.