కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీ

బుక్‌మార్క్‌లు అంటే ఏంటి? వాటిని ఎలా పెట్టుకోవాలి?—Android

బుక్‌మార్క్‌లు అంటే ఏంటి? వాటిని ఎలా పెట్టుకోవాలి?—Android

మీరు ఓ ముద్రిత ప్రచురణలో దారంతో లేదా తాడుతో గుర్తు పెట్టుకున్నట్టే, JW లైబ్రరీలో కూడా బుక్‌మార్క్‌లను ఉపయోగించి ఏ ప్రచురణలోనైనా గుర్తులు పెట్టుకోవచ్చు. JW లైబ్రరీలో ప్రతీ ప్రచురణకు 10 బుక్‌మార్క్‌లు పెట్టుకునే అవకాశం ఉంది.

బుక్‌మార్క్‌లను ఉపయోగించడానికి ఈ సూచనలు పాటించండి:

 కొత్త బుక్‌మార్క్‌ పెట్టుకోండి

మీరు ఓ ఆర్టికల్‌ దగ్గరగానీ అధ్యాయం దగ్గరగానీ బుక్‌మార్క్‌ పెట్టుకోవచ్చు. లేదా ఓ పేరా దగ్గరగానీ, బైబిలు వచనం దగ్గరగానీ బుక్‌మార్క్‌ పెట్టుకోవచ్చు.

ఓ ఆర్టికల్‌ దగ్గరగానీ అధ్యాయం దగ్గరగానీ బుక్‌మార్క్‌ పెట్టుకోవాలంటే, బుక్‌మార్క్‌ అనే బటన్‌ మీద క్లిక్‌ చేయండి. ఆ ప్రచురణలో మీరు ఇప్పటివరకు పెట్టుకున్న బుక్‌మార్క్‌ల లిస్టు కనిపిస్తుంది. ఆ లిస్టులో ఖాళీగా ఉన్న బుక్‌మార్క్‌ని, ప్రస్తుతం మీరు చదువుతున్న ఆర్టికల్‌ లేదా అధ్యాయం దగ్గర పెట్టుకోవచ్చు.

ఓ పేరా దగ్గర లేదా బైబిలు వచనం దగ్గర బుక్‌మార్క్‌ పెట్టుకోవాలంటే ముందు ఆ వాక్యం మీద క్లిక్‌ చేసి, బుక్‌మార్క్‌ గుర్తు మీద క్లిక్‌ చేయండి.

 బుక్‌మార్క్‌లోకి వెళ్లండి

మీరు ఎక్కడెక్కడ బుక్‌మార్క్‌లు పెట్టుకున్నారో తెలుసుకోవడానికి, ముందు ఆ ప్రచురణను తెరవండి, తర్వాత బుక్‌మార్క్‌ అనే బటన్‌ మీద క్లిక్‌ చేయండి. ఆ లిస్టులో వచ్చిన వాటిలో మీరు చూడాలనుకుంటున్న దానిమీద క్లిక్‌ చేయండి.

 బుక్‌మార్క్‌లో మార్పులు చేసుకోండి

మీరు బుక్‌మార్క్‌ పెట్టుకున్న తర్వాత, కావాలనుకుంటే దాన్ని మార్చుకోవచ్చు లేదా డిలీట్‌ చేయవచ్చు.

బుక్‌మార్క్‌ను డిలీట్‌ చేయడానికి, బుక్‌మార్క్‌ అనే గుర్తుమీద క్లిక్‌ చేసి, మీరు డిలీట్‌ చేయాలనుకుంటున్నదాన్ని స్వైప్‌ చేయండి. తర్వాత డిలీట్‌ బటన్‌ క్లిక్‌ చేయండి.

బుక్‌మార్క్‌ను మార్చుకోవడానికి, బుక్‌మార్క్‌ అనే గుర్తుమీద క్లిక్‌ చేసి, మీరు మార్చాలనుకుంటున్నదాన్ని స్వైప్‌ చేయండి. తర్వాత మార్చు అనే బటన్‌ క్లిక్‌ చేయండి. అప్పుడు పాత బుక్‌మార్క్‌ పోయి, ఇప్పుడు మీరు పెట్టుకున్న చోట బుక్‌మార్క్‌ వస్తుంది. మీరు ఏదైనా ఓ ప్రచురణలో ఎంతవరకు చదివారో గుర్తుపెట్టుకోవడానికి ఇది బాగా సహాయం చేస్తుంది. మీరు ప్రతీరోజు బైబిలు ఎంతవరకు చదివారో కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు.

ఈ ఫీచర్లన్నీ 2014, మేలో విడుదలైన JW లైబ్రరీ 1.2 వర్షన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 2.3 వర్షన్‌ లేదా తర్వాతి వర్షన్‌ ఉన్న మొబైల్స్‌లో లేదా ట్యాబ్స్‌లో ఈ లైబ్రరీ యాప్‌ పనిచేస్తుంది. ఈ ఫీచర్స్‌ మీకు రాకపోతే, దయచేసి “JW లైబ్రరీ​—ఆండ్రాయిడ్‌ వర్షన్‌ని ఉపయోగించడం మొదలుపెట్టండి” అనే ఆర్టికల్‌లో కొత్త ఫీచర్స్‌ అనే అంశం కింద చూడండి.